నిజానిజాలు త్వరలో బయటకి వస్తాయి అని చెబుతున్న హర్షసాయి?
ఈ క్రమంలో హర్ష సొంత దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో 'మెగా లో డాన్' అనే సినిమాని చేసిన సంగతి కూడా తెలిసినదే. ఆ సినిమా ద్వారా వచ్చిన డబ్బులతో కూడా హర్ష పేదవారికి సేవ చేస్తానని చెప్పగా సదరు సినిమా ఏం కారణం చేతనో మరి, విడుదలకు నోచుకోలేదు. ఇక అసలు విషయంలోకి వెళితే, తాజాగా ఓ నటి హర్షపైన రేప్ కేసు పెట్టడంతో... ప్రస్తుతం తెలుగు మీడియా ఛానళ్లు ఆ విషయంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనబడుతోంది. హైదరాబాద్ నార్సింగ్ పీఎస్‌లో ఆమె ఇచ్చిన కంప్లైంట్‌తో హర్ష సాయి డర్టీ పిక్చర్ వెలుగు చూసింది. హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని మోసం చేశాడని బిగ్ బాస్ ఓటీటీ మాజీ కంటెస్టెంట్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించడం ఇపుడు పెను సంచలనంగా మారింది.
ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. తన దగ్గర 2 కోట్ల రూపాయిలు తీసుకొని మరీ ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని కంప్లేంట్ చేశారామె. అదేవిధంగా ఆమె పర్సనల్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసి, మరిన్ని డబ్బులు గుంజాలని చూస్తున్నాడని కూడా ఆరోపించింది. ఇకపోతే ఇదంతా ఆమె డబ్బులు కోసమే చేసిందని, నిజా నిజాలు త్వరలోనే తేలుతాయని హర్ష తాజాగా సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం హర్ష లాయర్ అదే పనిలో ఉన్నారని, ఆమె హర్షతో గతంలో ఎలా బిహేవ్ చేసిందో అన్న విషయాలు కూడా వెలికి వస్తాయని హర్ష చెప్పుకొచ్చారు. ఇకపోతే హర్ష సాయి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం!