ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ఒక దాని తర్వాత ఒక ఎఫైర్ గురించి చర్చ నడుస్తూనే వస్తుంది. కొంత కాలం క్రితం
టాలీవుడ్ యువ నటుడు అయినటు వంటి
రాజ్ తరుణ్ విషయం తెలుగు సినీ పరిశ్రమను ఊపు ఊపింది. ఓ
అమ్మాయి తనను
రాజ్ తరుణ్ వాడుకున్నాడు అని .. చాలా సంవత్సరాల పాటు
పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇప్పుడు మాత్రం పెళ్లికి దూరంగా ఉంటున్నాడు అని ఆయనపై కేసు పెట్టింది.
రాజ్ తరుణ్ కు సంబంధించిన చర్చ ఓ వైపు నడుస్తూ ఉన్న సమయంలోనే ఆయన ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇక ఈయనకు సంబంధించిన నెగటివ్ వార్తల వాళ్లనో ఏమో తెలియదు కానీ 50 రోజుల్లోనే
రాజ్ తరుణ్ నటించిన మూడు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఏ
సినిమా కూడా కనీసం యావరేజ్ విజయాన్ని కూడా అందుకోలేదు. ఇలా
రాజ్ తరుణ్ విషయం ఓ వైపు నడుస్తూ ఉండగానే ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్
జానీ మాస్టర్ వ్యవహారం తెర పైకి వచ్చింది.
జానీ మాస్టర్ తనను చాలా సంవత్సరాలుగా వేధిస్తున్నాడు అని , మాట వినకుంటే అవకాశాలు రాకుండా చేస్తాను అని నన్ను అనేక సార్లు చిత్రవధ చేశాడు అని ఓ మహిళ
జానీ మాస్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక
జానీ మాస్టర్
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన డాన్స్ కొరియో గ్రాఫర్ కావడంతో ఈయన విషయం కూడా తెలుగు సినీ పరిశ్రమలో చాలా హైలెట్ అయింది. ఇక
యూట్యూబ్ గా మంచి గుర్తింపును సంపాదించుకొని నటన వైపు ఆసక్తిని చూపిస్తున్న హర్ష సాయి పై కూడా తాజాగా ఓ కేసు నమోదు అయింది. ఈయన మాత్రం అవన్నీ తప్పుడు కేసులు అని చెబుతున్నాడు. ఇలా ఈ మధ్య కాలంలో అఫ్ఫైర్స్ విషయాలు
టాలీవుడ్ ను ఓ ఊపు ఊపుతున్నాయి.