ఆ రెండు భాషల్లో కూడా వచ్చేసింది ఇప్పుడు రీమిక్ అవసరమా.. స్టార్టింగ్ లోనే బ్రేకులు పడ్డాయిగా..?

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితం హిందీలో కిల్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకు విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన మౌత్ తక్ వచ్చింది. దానితో ఈ సినిమా కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. చివరగా ఈ మూవీ భారీ కలక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను రాఘవ లారెన్స్ హీరోగా రమేష్ వర్మ తెలుగు , తమిళ్ లో రీమిక్ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం వీరి కాంబోలో రూపొందబోయే సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు.

ఈ మూవీ పోస్టర్ను గమనిస్తే అది కిల్ మూవీ కి రీమేక్ లాగానే అనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కిల్ తెలుగు , తమిళ్ డబ్బింగ్ వెర్షన్ లను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి ప్లాట్ ఫామ్ వారు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఇప్పటికే ఈ సినిమా తెలుగు , తమిళ భాషలలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరి రెండు భాషలలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాను రీమేక్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా.

మరి ఈ మూవీ యొక్క తెలుగు , తమిళ్ వెర్షన్ లు అందుబాటు లోకి వచ్చాయి కాబట్టి ఒక వేళ రాఘవ లారెన్స్ , రమేష్ వర్మ కాంబోలో మరి కొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే సినిమా కిల్ మూవీ కి రీమిక్ అయినట్లు అయితే దానిని తీస్తారా ... ఆపివేస్తారా అనేది చూడాలి. ఏదేమైనా ఈ మధ్య కాలంలో రీమిక్ సినిమాలు పెద్దగా సక్సెస్ కావడం లేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా రీమిక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: