తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవితో
సినిమా అంటే చాలా మంది దర్శకులు ఎగిరి గంతేసి ఒప్పుకుంటూ ఉంటారు. కానీ ఓ దర్శకుడు మాత్రం ఆయనతో
సినిమా అంటే భయపడ్డాడట. ఆ దర్శకుడు ఎవరు..? ఎందుకు భయపడ్డాడు అనే వివరాలు తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో
బి గోపాల్ ఒకరు. ఈయన తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న
చిరంజీవి ,
బాలకృష్ణ ,
నాగార్జున ,
వెంకటేష్ వీరందరితో సినిమాలు చేసి అందరితో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాడు.
మరి ముఖ్యంగా ఈయన
చిరంజీవి ,
బాలకృష్ణ ,
వెంకటేష్ లకు బ్లాక్ బాస్టర్ విజయాలను అందించాడు. ఇంత గొప్ప ట్రాక్ రికార్డు కలిగిన ఈయన చిరంజీవితో
సినిమా అంటే మాత్రం భయపడ్డాడట. అది ఎందుకు అనుకుంటున్నారా ..?
చిరంజీవి తో మెకానిక్ అల్లుడు అనే సినిమాను గోపాల్ రూపొందించాడు. ఆ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఆయనకు
అశ్వినీ దత్ బ్యానర్లో చిరుతో
మూవీ అవకాశం వచ్చింది. ఇక ఆయన చిరంజీవితో
మూవీ కోసం చిన్ని
కృష్ణ దగ్గర ఉన్న కథను విన్నాడట. కానీ ఆ కథ ఆయనకు నచ్చలేదు. దానితో ఆయన చిరంజీవితో
సినిమా చేయకూడదు అనుకున్నాడట.
దానికి ప్రధాన కారణం ఆయన అప్పటికే
సమరసింహా రెడ్డి నరసింహనాయుడు అనే ఫ్యాక్షన్ సినిమాలను చేసి ఉండడం , చిన్ని
కృష్ణ దగ్గర ఉన్న కథ కూడా దాదాపుగా అలాగే ఉండడంతో మరో సారి ఏదైనా తేడా కొట్టి మెకానిక్ అల్లుడు లా ఈ
సినిమా ఫ్లాప్ అయితే బాగుండదు. చిరంజీవికి కచ్చితంగా హిట్ ఇవ్వాలి. ఇలాంటి
సినిమా చేయకూడదు అని ఆయన భయపడ్డాడట. కానీ చివరకు
చిరంజీవి తో చిన్ని
కృష్ణ కథతో
ఇంద్ర మూవీ ని రూపొందించి
ఇండస్ట్రీ హిట్ ను గోపాల్ కొట్టాడు.