దేవర సినిమా మరో రెండు రోజుల్లో విడుదలవబోతుండగా ఒక షాకింగ్ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది... అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో దేవర సినిమాకి చుక్కెదురైంది. ఇక ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునేలా ముందే చిత్ర యూనిట్ టిడిపి కూటమి ప్రభుత్వానికి చెప్పుకున్నారు.ఇక ఈ విషయంలో టిడిపి కూటమి ప్రభుత్వం కూడా పాజిటివ్ గా స్పందించి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేలా అవకాశం ఇచ్చింది.ఈ సినిమా విడుదలయ్యాక 14 రోజుల వరకు సినిమా టికెట్లు పెంచుకునేలా ఏపీ సర్కార్ జీవో జారీ చేసింది.అయితే తాజాగా ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఆంధ్రప్రదేశ్లో 14 రోజులపాటు దేవర సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునేలా టిడిపి కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని ఖండించింది. కేవలం 10 రోజులు మాత్రమే సినిమా టికెట్ల రేట్లు పెంచాలని సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది.
అయితే 14 రోజులను 10 రోజులకే పరిమితం చేయడంతో దేవర టీం కి ఏపీలో షాక్ తగిలినట్టు అయింది. హైకోర్టు లో దేవర సినిమాకి పది రోజులు మాత్రమే టికెట్ రేట్లు పెంచుకునేలా ఆదేశాలు ఇవ్వమని సూచించింది. దీంతో చిత్ర యూనిట్ కి పెద్ద షాక్ తగిలింది. అయితే హైకోర్టు నిర్ణయం పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుమాన పడుతున్నారు. దేవర సినిమాకి 14 రోజులు టికెట్ రేట్లు పెంచుకోవడానికి టిడిపి కూటమి ప్రభుత్వం ముందుగా ఓకే చెప్పి మళ్ళీ ఇప్పుడు హైకోర్టు ద్వారా పది రోజులకే పరిమితం చేసింది.
అంటే దీని వెనుక ఏదో కుట్ర జరుగుతోందని, అందరి ముందు అందరూ నాకు సమానమే అని ఎన్టీఆర్ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోమని చెప్పి, ఆ తర్వాత హైకోర్టు ద్వారా ఎన్టీఆర్ సినిమాకి చంద్రబాబు నాయుడు పెద్ద షాక్ ఇచ్చారని,దీని వెనుక చంద్రబాబు ఉన్నారని కొంతమంది ఫ్యాన్స్ అనుమాన పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏపీలో దేవర సినిమాకి పెద్ద షాక్ తగిలింది అని చెప్పుకోవచ్చు. ఇక దేవర సినిమా మల్టీప్లెక్స్ లో ఒక్క టికెట్ కి రూ. 135 అలాగే సింగల్ స్క్రీన్ థియేటర్లో అప్పర్ క్లాస్ కి 110 లోయర్ క్లాస్ కి 60 రూపాయల వరకు పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ 14 రోజుల సమయాన్ని పది రోజులకు కుదించి హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది