ప్లీజ్ ఆ పని చేయొద్దు.. దేవర ఫ్యాన్స్ కు నాగవంశీ రిక్వెస్ట్..!!

murali krishna
నందమూరి తారక రామారావు, జాన్వీ కపూర్ జోడిగా నటిస్తున్న చిత్రం దేవర. మరో రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో దిగబోతోంది. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ స్టార్ట్ చేసారు.ఈ నేపథ్యంలో సితార నాగవంశీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నాగవంశీ ప్రస్తుతం చిన్నా, పెద్ద చిత్రాలలో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొత్త వాళ్లతో సినిమాలు చేస్తున్నాడు. స్టార్ హీరోల ప్రాజెక్టులను కూడా లైనప్‌లో పెట్టేశాడు.ఎక్స్‌ లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ నిర్మాత చుట్టూ కాంట్రవర్సీలు తిరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. మ్యాడ్ వంటి హిట్ ఇచ్చిన ఈ నిర్మాతే ఆదికేశవ లాంటి డిజాస్టర్ కూడా ఇచ్చాడు.ఈ నేపథ్యంలో 'దేవర' డిస్ట్రిబ్యూటర్స్‌లో ఒకరైన నాగవంశీ అభిమానులకు ఓ విన్నపం చేశారు.ఈ సినిమాతోనైనా ఫ్యాన్ వార్స్‌కు ముగింపు పలకాలని కోరారు. ఈమేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.''తారక్‌ అన్న చాలా గ్యాప్‌ తర్వాత మంచి ఎమోషనల్‌ మాస్ కంటెంట్‌తో వస్తున్నారు. ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ని అందించడంలో ఆయన తనవంతు బాధ్యత నిర్వర్తించారు. ప్రభుత్వ సాయంతో చాలా రోజుల తరువాత ఏపీలో బెనిఫిట్‌ షోలు, ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో దీనిని విడుదల చేసేలా మేము మా బాధ్యత పూర్తి చేశాం. కాబట్టి, మా నుంచి ఒక చిన్న విజ్ఞప్తి. మీరు కూడా బాధ్యతతో ప్రశాంతంగా ఉండండి. అనవసరమైన ఫ్యాన్‌ వార్స్‌ క్రియేట్‌ చేయొద్దు. ఇలాంటి ఫ్యాన్‌ వార్స్ వల్ల మన సినిమాపై మనమే నెగటివిటీ ఆహ్వానిస్తున్నట్లు దీనివల్ల తాత్కాలిక ఆనందం పొందవచ్చు.

కానీ, మన హీరోల చిత్రాలపై ఇది ఎంతో ప్రభావం చూపిస్తుంది. దయచేసి అభిమానులంతా ఫ్యాన్‌ వార్స్‌కు స్వస్తి పలకాలని సినిమాని ఎంజాయ్‌ చేయాలని కోరుతున్నా. ఈ సినిమా నుంచి అయినా సోషల్‌మీడియా వేదికగా జరిగే ఫ్యాన్‌ వార్స్‌కు ముగింపు పలికేలా ప్రతిన పూనండి. అదేవిధంగా ఫస్ట్‌ స్క్రీనింగ్‌లో సినిమా చూసే అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు షేర్‌ చేయొద్దు. పక్కవారు వీడియోలు తీయకుండా చూడండి. మీ తర్వాత చూసే అభిమానులూ సినిమాని ఎంజాయ్‌ చేయనివ్వండి. తారక్‌ అన్నకు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్‌ అందిద్దాం. దేవర సెప్పిండు అంటే సేసినట్టే'' అని నాగవంశీ పోస్ట్ చేశారు.ఇదిలావుండగా మొత్తం అయిదు భాషలలో విడుదల కాబోతున్న "దేవర"కు తెలుగు, హిందీలతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా ఈ వారం పెద్దగా పోటీ లేకపోవడం కలిసొచ్చే అంశం. ఈ వీకెండ్ తో పాటు తదుపరి వారం నుండి దసరా పర్వదినం సెలవులు కావడంతో బాక్సాఫీస్ వద్ద "దేవర" దూకుడుకు అదుపు ఉండకపోవచ్చు. అయితే కావాల్సిందల్లా 'పాజిటివ్' టాక్! ప్రీమియర్ షోస్ నుండి ఆ ఒక్కటి గనుక వస్తే, బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన రికార్డులను "దేవర" అందుకుంటాడని చెప్పడంలో సందేహం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అర్ధరాత్రి షోస్ కు అనుమతులు రావడంతో, అభిమానులు బెనిఫిట్ షోలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: