దేవర: ఎన్టీఆర్ కోసం రంగంలోకి వైసీపీ ?
ఈ సినిమా రెండు భాగాలుగా.. కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. దేవర సినిమా మొదటి భాగం రెండు గంటల 50 నిమిషాల పాటు నిడివి ఉంది. ఈ మేరకు తాజాగా చిత్ర బృందం కూడా ప్రకటించింది. అంతేకాదు ఈ సినిమా పైన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. టికెట్ల ధరలు పెంచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే 14 రోజులపాటు టికెట్ ధరలను పెంచుకోవాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోగా తాజాగా ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది.
కేవలం 10 రోజులపాటు ఏపీలో టికెట్ ధరలు పెంచుకోవాలని ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే దేవర సినిమాకు నష్టాలు వచ్చేలా టిడిపి పార్టీనే... వ్యవహరిస్తోందని... ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించింది వారేనని వైసీపీ చెబుతోంది. ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ గుంజుకున్నట్లుగా... చంద్రబాబు సర్కార్... జూనియర్ ఎన్టీఆర్ సినిమా పైన వ్యవహరిస్తోందని వైసిపి వాదిస్తోంది. అయితే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు షాక్ ఇచ్చిన నేపథ్యంలో... వైసీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారట.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైసీపీ నేతలు అలాగే నందమూరి ఫ్యాన్స్... దేవర సినిమాకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారట. శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో... కచ్చితంగా ఈ సినిమాను థియేటర్లో చూసి సక్సెస్ చేయాలని... వైసిపి భావిస్తుందట. చంద్రబాబు వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య... విభేదాలు ఉన్న నేపథ్యంలో... దేవరకు అండగా నిలవాలని వైసిపి అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే వైసిపి నేతలు అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమా ఖచ్చితంగా చూసి సక్సెస్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట.