తిరుమల లడ్డూ వివాదంపై రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ నటుడు కార్తీ తన లేటెస్ట్ మూవీ సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తిరుమల లడ్డూపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన 'సత్యం సుందరం' మూవీ ఈవెంట్ లో.. ఒక మీమ్ చూపిస్తూ "లడ్డు కావాలా నాయనా..?" అని యాంకర్ అనగా.. దానికి స్పందించిన హీరో కార్తీ నవ్వుతూ "ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్ అది. మనకొద్దు." అన్నాడు. దాంతో ఆ ఈవెంట్ లో ఉన్నవారు నవ్వేశారు. అయితే కార్తీ చేసిన కామెంట్స్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్అసహనం వ్యక్తం చేశారు. "లడ్డు మీద మీరు జోకులేయడం కరెక్ట్ కాదు. సనాతన ధర్మం గురించి మాట్లాడేముందు ఒకటికి వంద సార్లు ఆలోచించి మాట్లాడండి" అని పవన్ అన్నారు. దాంతో వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందించిన కార్తీ.. క్షమాపణలు చెప్పడమే కాకుండా, తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడినని చెప్పుకొచ్చాడు. కార్తీ అలా వెంటనే స్పందించి, క్షమాపణలు చెప్పడంతో ఆయనపై ప్రశంసలు కురిశాయి. అయితే సీనియర్ నటి కస్తూరి మాత్రం కార్తీ కుటుంబానికి ఇటువంటి కామెంట్స్ చేయడం అలవాటే అంటూ అసలు మేటర్ బయట పెట్టేశారు.కార్తీ లడ్డు వివాదంపై నటి కస్తూరి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "పవన్ కళ్యాణ్ గారి వార్నింగ్ తర్వాత, కార్తీ వెంటనే క్షమాపణలు చెప్పాడు. తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడినని చెప్పుకొచ్చాడు. కార్తీకి తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమా విడుదలకు సిద్ధమైంది. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకు చెప్పాడో.
అసలు ఏం జరిగింది అంటే.. సత్యంసుందరం సినిమా ప్రమోషన్ ఈవెంట్లో లడ్డూ మీమ్‌ని తీసుకొచ్చారు. అసలు ఈవెంట్ రైటర్, డైరెక్టర్, యాంకర్ ఏమి అనుకుంటున్నారో. వాళ్ళకి ఇది జోక్‌గా ఉందనుకుంటా?. కార్తీ ఈ దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు, కానీ ఫెయిల్ అయ్యాడు.యాంకర్ మూర్ఖంగా వ్యవహరించింది. ఇలాంటి వాటిలో హాస్యం వద్దని.. యాంకర్ ని కార్తీ హెచ్చరిస్తే బాగుండేది. కానీ యాంకర్‌ను నొప్పించకుండా జోక్ తో అవాయిడ్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ చర్య చాలా మందిని బాధపెట్టింది. సనాతన పద్ధతులపై కార్తీ కుటుంబం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవ్వడం ఇదే మొదటిసారి కాదు. శబరి మాలపై శివకుమార్ సర్ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే, జ్యోతిక ఆలయ వ్యతిరేక వ్యాఖ్య లు తీవ్ర దుమారం రేపాయి.తంజావూరు బృహదీశ్వరాలయం లేదా శబరిమల గురించి మాట్లాడి తప్పించుకోవచ్చు. తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులతో మీరు చెలగాటమాడలేరు. హిందూ వ్యతిరేకత ఆంధ్రాలో స్వాగతించబడదు. ఓం నమో వేంకటేశాయ." అంటూ కస్తూరి వరుసపోస్ట్ తో విరుచుకుపడ్డారు.అయితే కస్తూరిపోస్ట్ పై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెకి సపోర్ట్ గా మాట్లాడుతుండగా.. మరికొందరు మాత్రం అప్పట్లో కార్తీతో కస్తూరి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా అసహనం వ్యక్తం చేశాడు. అందుకే ఇప్పుడామె కార్తీని టార్గెట్ చేసిందని కామెంట్ చేస్తున్నారు.