టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర అనే భారీ బడ్జెట్ పాన్
ఇండియా మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ లో
బాలీవుడ్ నటి
జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ...
బాలీవుడ్ నటుడు
సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ
సినిమా యొక్క మొదటి భాగాన్ని
సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ మధ్య కాలంలో కొంత మంది సినీ ప్రేమికులు సినిమాలను థియేటర్లలో చూడటం కంటే ఓ టీ టీ లో చూడడం బెటర్ అనే ఆలోచనకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. దానికి ప్రధాన కారణం కొన్ని మూవీలు థియేటర్లలో విడుదల అయిన నెల రోజులు తిరగకుండానే ఓ టీ టీ లోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని సినిమాలు వారం , రెండు వారాల్లో ఓ టీ టీ లోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానితో చాలా మంది థియేటర్లకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి
సినిమా చూడడం కంటే వారం , పది రోజుల్లో ఓ టీ టీ లోకి సినిమాను వచ్చేస్తాయి. అక్కడ ఎంచక్కా చూడొచ్చు అనే ఉద్దేశంలో ఉన్న జనాలు కూడా ఉన్నారు.
ఇకపోతే దేవర విషయంలో మాత్రం
మూవీ యూనిట్ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ థియేటర్లలో విడుదల అయిన తర్వాత 50 రోజులు పూర్తి అయ్యాకే ఓ టీ టీ లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దానితో ఎవరైనా ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓ టి టి లో చూద్దాం అనుకున్నట్లయితే వారు ఏకంగా 50 రోజుల పాటు వెయిట్ చేస్తేనే ఈ సినిమాను ఓ టీ టీ లో చూసే అందుబాటు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.