దేవర: జాన్వీని నమ్మించి గొంతు కోసిన కొరటాల ?

Veldandi Saikiran
సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'దేవర'. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో ఈ సినిమా రాబోతోంది. ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దేవా, వర అనే రెండు విభిన్నమైన పవర్ఫుల్ రోల్స్ లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నాడు.

కాగా రెండు పార్టులుగా రాబోతున్న దేవర సినిమా పార్ట్ రన్ టైం లో కాస్త మార్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు లాక్ చేసిన సినిమా నిడివిలో దాదాపుగా ఏడు నిమిషాలు ట్రిమ్ చేసి తొలగించినట్లుగా సమాచారం అందుతుంది. 2 గంటల 50 నిమిషాలు ఉన్న దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ధూమపానం హెచ్చరిక మినహాయిస్తే ఈ సినిమా రన్ టైం 2 గంటల 42 నిమిషాలు మాత్రమే ఉంది.
ఇది ఇలా ఉండగా.. దేవర పార్ట్ వన్ లో జాన్వి రోల్ చాలా తక్కువ సమయం ఉంటుందట. కేవలం 15 నిమిషాలు మాత్రమే జాన్వి కపూర్ క్యారెక్టర్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అందులో "చుట్టమల్లే" పాట మూడున్నర నిమిషాల పాటు ఉంటుంది. అది కూడా కొన్ని లవ్ సీన్స్ తో పది నిమిషాలకు పైగా జాన్వి స్క్రీన్ టైం ఉంటుందని టాక్. ఇక దావూదీ రూపంలో మరో సాంగ్ ఉండనుండగా.... అది కేవలం రోలింగ్ టైటిల్స్ కె పరిమితం అవుతుందని సమాచారం. ఇప్పుడు అసలు ఆ పాటని పూర్తిగా తొలగించారని కూడా అనేక రకాల వార్తలు వస్తున్నాయి.

ఈ లెక్క ప్రకారం జాన్విని బిగ్ స్క్రీన్ పై చూడాలనుకొని థియేటర్ కు వెళ్లే వారికి ఇది పెద్ద డిసప్పాయింట్మెంట్ అని చెప్పవచ్చు. ఆ మధ్యకాలంలో జాన్వి సైతం బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవర పార్ట్ వన్ లో తన పాత్ర నిడివి చాలా తక్కువ సమయం ఉంటుందని పార్ట్ 2 లో ఎక్కువగా ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అంత తక్కువ ఉన్నప్పటికీ మరి 15 నిమిషాలే ఆమె స్క్రీన్ టైం ఉండడం జాన్వి ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశను కలిగించే విషయం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: