ఆ పద్ధతి ఫాలో కాకపోతే స్టార్ హీరో మూవీస్ బడ్జెట్ రికవరీ కష్టమేనా..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం మన స్టార్ హీరోలు కేవలం తెలుగు భాషలో సినిమాలను మాత్రమే చేసేవారు. ఏదో ఒకటి , రెండు సినిమాలు రెండు భాషల్లో విడుదల అయ్యేవి. ఇక బాహుబలి సినిమాతో ఈ సిస్టం మొత్తం మారిపోయింది. బాహుబలి మూవీ తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల కావడం , అన్ని ప్రాంతాలలో అద్భుతమైన విజయం సాధించడం , ఆ సినిమాకు భారీ కలెక్షన్లు రావడంతో తెలుగు సినిమా హీరోలు , నిర్మాతలు , దర్శకులు అంతా కూడా పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలలో నటించారు.

ప్రస్తుతం కొంత మంది నటిస్తున్నారు. ఇకపోతే పాన్ ఇండియా సినిమాలు అంటే హీరోలు చాలా రోజులను కేటాయించవలసి ఉంటుంది. అలాగే హీరోయిన్లు , దర్శకులు , నటీ నటులు , టెక్నీషియన్స్ ఇలా అందరూ ఎక్కువగా రోజులనే కేటాయించాలి. అలా కేటాయించడం వల్ల రెమ్యూనరేషన్లు ఎక్కువ గానే అవుతుంటాయి. దానితో బడ్జెట్లో విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా పాన్ ఇండియా సినిమాలు బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉండటంతో దానిని ఒకే పార్ట్ ను రాబట్టడం కష్టం అని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ మేకర్స్ దాదాపు పాన్ ఇండియా సినిమా అంటే చాలు రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది.

ఈ మధ్య కాలంలో విడుదల అయిన పాన్ ఇండియా సినిమాలలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఒక పార్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దాదాపు ప్రతి దానికి కూడా రెండవ పార్ట్ ఉండబోతున్నట్లే అధికారిక ప్రకటనలు వచ్చేస్తున్నాయి. ఇదంతా కూడా బడ్జెట్ రికవరీ కోసం అని కొంత మంది అంటుంటే , కొంత మంది మాత్రం కథలో బలం లేకపోతే రెండవ భాగం తీయడం వల్ల ఏం లాభం ఉండదు అని కొంత మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: