దేవర 2 స్టార్ట్ అయ్యేది అప్పుడే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టెన్షన్ లో పెట్టిన కొరటాల..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకుల లో కొరటాల శివ ఒకరు . మిర్చి మూవీ తో డైరెక్టర్ గా కెరియర్ను మొదలు పెట్టిన ఈయన వరుసగా విజయాలను అందుకొని చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకుడి స్థాయికి ఎదిగాడు . సూపర్ క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో ఈయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమాను రూపొందించాడు . ఈ మూవీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది . ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది.

అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా దేవర 2 సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కొరటాల శివ మాట్లాడుతూ ... దేవర 2 మూవీ స్టార్ట్ కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

ఎందుకు అంటే ఈ సినిమాలో ఎంతో మంది నటీ నటులు ఉన్నారు. వారందరి డేట్ లు అడ్జస్ట్ కావడం అంటే కాస్త కష్టమైన పని. వారి డేట్స్ అడ్జస్ట్ అయ్యాక దేవర 2 ప్రారంభం అవుతుంది. అది కాస్త లేట్ అయినట్లయితే నేను మరో సినిమా చేసి దేవర మూవీ ని మొదలు పెడతాను అని కొరటాల శివ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా తెలియజేశాడు. ఇలా దేవర ఆల్మోస్ట్ లేట్ కాబోతున్నట్లు కొరటాల శివ చెప్పుకొచ్చాడు. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: