బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్స్ కి దర్శకుడు దొరికేసాడు...ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali krishna
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్ కొట్టి మంచి జోరుమీద ఉన్నారు. బాబీ దర్శకత్వంలో తర్వాత సినిమా చేస్తున్నారు. దీనిమీద కూడా అంచనాలు భారీగా నెలకొన్నాయి. కాలానికి అనుగుణంగా తాను కూడా మారుతూ, కథలను ఎంచుకుంటున్న ఆయనకు విజయాలు వరుసగా పలకరిస్తున్నాయి.ఇదిలావుండగా ఆయన కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాలుగా ఆదిత్య 369, బైరవద్వీపం ఫిక్షన్ కంటెంట్ తో అలరించాయి. ఆదిత్య 369 సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఎంతో అద్భుతంగా తెరకెక్కింది. భైరవ ద్వీపంలో ఫిక్షనల్ అంశాలను అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య మైథలాజికల్ ఫాంటసీ మల్టీవర్స్ లో అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన కథలతో సినిమాలను తీస్తున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కుర్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలుగులో మొట్టమొదటి సూపర్ హీరో కథగా తెరెకెక్కిన హనుమాన్ మూవీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో నే టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ సినిమాల జాబితాలో ‘ఆదిత్య 369’ సినిమా కూడా స్థానం సంపాదించుకుంది. మూడు డిఫరెంట్ టైం లైన్స్ లో ఈ సినిమా కథని సింగీతం చెప్పారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.బాలకృష్ణకి కూడా ‘ఆదిత్య 369’ సినిమా అంటే ప్రత్యేమైన అభిమానం ఉంది. అందుకే దానికి సీక్వెల్ చేస్తానని ప్రకటించారు.

ఆదిత్య 999 టైటిల్ తో మూవీ చేస్తానని, దానికి తానే దర్శకత్వం వహిస్తానని బాలకృష్ణ గతంలో ప్రకటించారు. అలాగే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ‘ఆదిత్య 999’ సినిమాతోనే ఉంటుందని బాలయ్య తెలిపాడు.అయితే బాలకృష్ణ హఠాత్తుగా మళ్ళీ ఈ ‘ఆదిత్య 999’ సినిమాని హోల్డ్ లో పెట్టారు. ఎందుకంటే మరోవైపు ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా తన కొడుకు మోక్షజ్ఞని లాంచ్ చేస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా హిట్ కొడితే ప్రశాంత్ వర్మకి బాలయ్య మరో ఆఫర్ ఇవ్వబోతున్నారంట. అదే ‘ఆదిత్య 999’. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలని బాలయ్య ప్రశాంత్ వర్మకి అప్పగించే అవకాశం ఉందంట. ఇప్పటికే ప్రశాంత్ వర్మకి ఒక మాట చెప్పి ఉంచారని టాక్.అలాగే ‘భైరవద్వీపం’ సీక్వెల్ బాధ్యతలు కూడా ప్రశాంత్ వర్మకి ఇవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలని మోక్షజ్ఞతోనే చేయడానికి బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారు. మరి మోక్షజ్ఞకి ప్రశాంత్ వర్మ ఎలాంటి సక్సెస్ ఇస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలావుండగా బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.భగవంత్ కేసిరి చిత్రంతో సూపర్ హిట్ ఇచ్చిన బాలయ్య.. తర్వాత బాజీ దర్శకత్వంలో కూడా మరో సూపర్ హిట్ ఇవ్వబోతున్నాడని బాలయ్య అభిమానులు సంబరంగా చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: