పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ గురించి చెప్పాలంటే ఎన్నిపేజీలు రాసినా సరిపోదు. ప్రభాస్ సినీ జీవితాన్ని విభజించి చూస్తే బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని రాయాలి. బాహుబలి తర్వాత నుంచి మొన్న విడుదలైన కల్కి వరకు అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలోబాక్సాఫీస్ దగ్గర 'కల్కి' దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ జూన్ 27 న రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది.ఇదిలావుండగా ఈ మూవీకి మరో అరుదైన గుర్తింపు దక్కింది. ఈ మూవీ .. 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. కల్కి ఓపెన్ సినిమా విభాగంలో ఈ ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈ ఏడాది 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అక్టోబర్ 2 నుండి 11 వరకు జరగనుంది.8,9తేదీల్లో బి ఐ యఫ్ యఫ్ లోని బిహిరంగ థియేటర్ లో షో లు వేయనున్నారు.ఇక భారీ అంచనాలతో జూన్ 27న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1,200 కోట్లకు పైగా వసూలు చేసింది.ఇదిలావుండగా ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం ప్రారంభం కాబోతోంది. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ తన కెరీర్ లో తొలిసారిగా పోలీసు అధికారిగా నటిస్తున్నారు. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ దీన్ని పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత కల్కి2 ఉండబోతోంది. రాజాసాబ్ కు, స్పిరిట్ కు మధ్యలో హను రాఘవపూడి సినిమాను పూర్తిచేసి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు ఫౌజీ అనే పేరు పరిశీలిస్తున్నారు.