ఒక సెంటిమెంట్ ప్రకారం చిరుకు బ్లాక్ బస్టర్.. మరో రకంగా ఫ్లాప్.. ఏది జరిగేనో..?

MADDIBOINA AJAY KUMAR
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని త్రిష , చిరుకు జోడీగా నటిస్తూ ఉండగా , మల్లాడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా , యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీని బట్టి చూస్తే ఓ రకంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. మరో రకంగా అపజయాన్ని అందుకునే అవకాశం ఉంది.

అది ఎలానో తెలుసా... 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు , వెంకటేష్ హీరోగా రూపొందిన దేవి పుత్రుడు సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో మృగరాజు సినిమా ఫ్లాప్ కాగా , నరసింహ నాయుడు ఇండస్ట్రీ హిట్ అయింది. దేవి పుత్రుడు పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. వచ్చే సంవత్సరం కూడా సంక్రాంతి పండుగకు చిరంజీవితో పాటు వెంకటేష్ , నాగార్జున సినిమాలు కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ రకంగా చూసుకుంటే విశ్వంభర కి నెగిటివ్ సెంటిమెంట్ ఉంది.

ఇక కొన్ని సంవత్సరాల క్రితం రామ్ చరణ్ హీరోగా రూపొందిన ధ్రువ సినిమా డిసెంబర్లో విడుదల కాగా ఆ తర్వాతి సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. ఖైదీ నెంబర్ 150 సినిమా మంచి విజయం అందుకుంది. ఇక ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ విడుదల కానుండగా , వచ్చే సంవత్సరం సంక్రాంతి కి చిరు నటించిన విశ్వంభర విడుదల కానుంది. ఈ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే విశ్వంభర మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకునే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: