పాపం ఎన్టీఆర్‌... "దేవర" కు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సెగ ?

Veldandi Saikiran
పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో సెప్టెంబర్ 27 అంటే రేపు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ సినిమా రేపు విడుదల కాబోతోంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా రాబోతోంది. ఇందులో శ్రీదేవి గారాల పట్టి జాన్వి కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు. స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు.

ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక అప్డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూనే ఉన్నాయి. కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటిస్తుండగా.... తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ సినిమాలో పనిచేసిన సినిమాటోగ్రాఫర్ మాత్రం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.... ఎన్టీఆర్ కేవలం ద్విపాత్రాభినయం మాత్రమే చేశాడని స్పష్టం చేశాడు.

ఇదిలా ఉండగా.... దేవర సినిమాకు ఊహించని షాక్స్ తగులుతూనే ఉన్నాయి. ఓవైపు భారీగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ ఎన్టీఆర్ అభిమానులకు చేరుకుంది. దేవర సినిమా పోస్టర్స్ పై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలతో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జన జాగరణ సమితి విజ్ఞప్తి చేస్తుంది.
కోట్లాది మంది అభిమానులు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుందని జన జాగరణ సమితి భావిస్తుందట. ఇందులో భాగంగానే.... విశాఖపట్నం రామా టాకీస్ థియేటర్ వద్ద సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్.... విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో పోస్టర్లను అంటించారు జన జాగరణ సమితి నాయకులు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సంచలనం రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: