జయం రవి విడాకులు అనౌన్స్ చేసినప్పటి నుండి ఆయన విడాకుల విషయంలో కోలీవుడ్‌లో పెద్ద రచ్చ జరుగుతుంది. ఆయన సింగర్ కెనీషాతో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోవడం కారణంగానే కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చారు అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది.అయితే ఈ విషయంపై జయం రవి తన సినిమా ప్రమోషన్స్‌లో క్లారిటీ ఇచ్చి అలాంటిదేమీ లేదు. ఆమె నాకు మంచి ఫ్రెండ్ అలాగే మానసిక నిపుణురాలు. ఆమెతో నేను త్వరలోనే ఒక ఆధ్యాత్మిక సెంటర్ ప్రారంభిస్తాను అంటూ చెప్పారు. కానీ సోషల్ మీడియాలో, కోలీవుడ్ మీడియాలో మాత్రం ఆర్తి జయం రవిల విడాకులకు కారణం సింగర్ కెనీషా అంటూ సంచలన పోస్టులు వైరల్ చేస్తున్నారు.అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించింది సింగర్ కెనీషా.. కెనీషా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జయం రవితో నాకు ఎఫైర్ అని,నావల్లే వాళ్ళిద్దరి కాపురం చెడిపోయిందని, విడాకులకు కారణం నేనే అంటూ ఎన్నో వార్తలు రాస్తున్నారు.కానీ వాళ్ళ విడాకులతో నాకు సంబంధం లేదు.
అసలు ఆయన విడాకులు అనౌన్స్ చేసే వరకు కూడా నాకు వారు విడిపోతున్నారనే సంగతి తెలియదు. ఇక ఆయన నా దగ్గరికి మొదటిసారి వచ్చింది డిప్రెషన్ లో ఉన్న సమయంలో.నేను మానసిక వైద్య నిపుణురాలిని అనే విషయం తెలుసుకొని నా దగ్గరికి చికిత్స కోసం వచ్చారు.నా దగ్గరికి వచ్చిన సమయంలో ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఆర్తి ఆమె పేరెంట్స్ పెట్టిన టార్చర్ కి జయం రవి పట్టపగలే చుక్కలు చూసాడు. పేరెంట్స్ చనిపోయిన కూడా అంత బాధ ఉండదేమో కానీ వాళ్లు పెట్టిన టార్చర్ అంతకంటే ఎక్కువగా ఉంది.అమ్మాయి నైనా అబ్బాయినైన అంత టార్చర్ చేసే హక్కు ఎవరికీ లేదు.
నా దగ్గరికి రవి వచ్చిన సమయంలో ఆయనకు నేను చేసిన ట్రీట్మెంట్ థెరిపి కి సంబంధించిన అన్ని నోట్స్ ఉన్నాయి. సాక్షాలతో సహా వీటన్నింటిని నేను కోర్టులో జయం రవి అనుమతి లేకుండా కూడా బయట పెట్టగలను అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది కెనీషా. ఆమె మాటలకు చాలామంది తమిళ జనాలు పాపం జయం రావిని ఆర్తి,ఆమె తల్లిదండ్రులు కలిసి అంతలా టార్చర్ చేశారా..వాళ్ల వేధింపులు తట్టుకోలేకే భార్యకు విడాకులు ఇచ్చేసి ఇంటి నుండి బయటకు వచ్చేసాడా అంటూ కామెంట్లు పెడుతున్నారు.