'దేవర' ముందు హాలీవుడ్‌ సినిమాలు పనికేరావు... గూస్​బంప్స్​ రావాల్సిందే ?

Veldandi Saikiran
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రానున్న చిత్రం దేవర. ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన అంటే రేపు విడుదల కానుంది. ఈ సినిమా ఆరంభంలోనే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వారి అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించారు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమాను అదిరిపోయే విధంగా ప్రమోట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గత కొన్ని రోజుల నుంచి ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఎన్టీఆర్ ప్రమోషన్స్ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే పలు రకాల ఈవెంట్స్ ని కూడా నిర్వహించారు. దేవర సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా అద్భుతంగా నటించింది. కానీ పార్ట్ వన్ లో జాన్వి పాత్ర కేవలం చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుందని తెలియడంతో జాన్వి అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇందులో శ్రీకాంత్, చాకో కీలక పాత్రల్లో నటించారు. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించారు.

ఇదిలా ఉండగా....ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ చేసిన కీలక వాక్యాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. దేవర సినిమా హాలీవుడ్ సినిమాను తలపిస్తుందని అనిరుద్ అన్నారు. దేవర సినిమా చూసే సమయంలో అవెంజర్స్, బ్యాట్మ్యాన్ సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో సెంటిమెంట్, యాక్షన్, డ్రామా అన్ని రకాలు ఉన్నాయని చెప్పారు. దేవర సినిమాకు అనిరుద్ ఇవ్వబోతున్న సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం అనిరుద్ ఈ సారి సంగీతంతో మాయ చేయడం ఖాయం అని అనుకుంటున్నారు. ఇక ప్రతి ఒక్కరు అనుకున్నట్లుగానే అనిరుద్ దేవర కోసం అద్భుతమైన పాటలను ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని పాటలు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం మరి కొద్ది గంటల్లోనే ముందుకు రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: