షాక్: హాస్పటల్ పాలైన.. బాహుబలి బ్యూటీ.. వీడియో వైరల్..!

Divya
బాలీవుడ్ స్పెషల్ సాంగులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి.. ఈ  అమ్మడు మొదట టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్ అనే చిత్రం ద్వారా పరిచయమయ్యింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో బిగ్ బాస్ హౌస్ లో కూడా పాల్గొనే అవకాశం అందుకుంది నోరా ఫతేహి. ఈ హౌస్ వల్ల భారీగా క్రేజ్ పెరగడంతో బాలీవుడ్ లో కూడా అవకాశాలు భారీగానే పెరిగిపోయాయి. స్టార్ హీరోల చిత్రాలలో అంటే కచ్చితంగా స్పెషల్ సాంగ్కు ఈ ముద్దుగుమ్మని ఎంపిక చేసేలా పాపులారిటీ సంపాదించుకుంది.
ముఖ్యంగా భారీగానే ఒక్క చిత్రంలో స్పెషల్ సాంగ్ కు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. తెలుగులో బాహుబలి చిత్రంలో మనోహరి అనే సాంగ్లో అదిరిపోయేలా డాన్స్ వేయడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి పాపులారిటీ అందుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏర్పడినట్లుగా ఒక వీడియో వైరల్ గా మారుతోంది. హాస్పిటల్ బెడ్డు పైన పడుకొని ఉండగా ఈమె చికిత్స తీసుకుంటున్నట్లు కనిపించడమే కాకుండా..అనారోగ్య సమస్యతో నరకయాతన పడుతున్నట్లు నడవలేని పరిస్థితులలో కూడా ఒక వాకింగ్ స్టిక్ పట్టుకొని నడుస్తూ ఉన్నట్టు కనిపిస్తోంది.

నోరా ఫతేహి కి ఏమైందో తెలియదు కానీ ఈ వీడియో చూసినప్పటి నుంచి అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అయితే ఏదైనా గాయం అయ్యిందా లేకపోతే మరేమైనా సమస్యలు అనే విషయం పైన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈమె అందచందాలతో అందరిని ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరే సినిమాలో కూడా కనిపించలేదు. ఇటీవల ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో డబ్బు, ఫేమ్ కోసమే చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని.. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం అంతకంటే దారుణం అంటూ తెలియజేసింది. అలాంటివారు బాలీవుడ్ లో చాలామంది ఉన్నారంటూ వెల్లడించింది నోరా ఫతేహి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: