అక్కడ తెలుగు సినిమాను పట్టించుకోరా.. దేవర తో మరోసారి ప్రూవ్ అయిందిగా..!!

murali krishna
పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి సినీ ఇండస్ట్రీ రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. మేకర్స్ కూడా తమ పరిధిని దాటి మాతృకతో పాటు పలు భాషల్లో సినిమాలు తెరకెక్కిస్తూ అక్కడి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. ఇక హీరోలు కూడా ఈ కానెప్ట్కు ఓటు వేస్తున్నారు. దీంతో పలువురు కోలీవుడ్ స్టార్స్ తెలుగు ఇండస్ట్రీ వైపుకు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్తో డీవీవీ దానయ్య ఓ భారీ సినిమాను ప్లాన్ చేసినట్లు సమాచారం. తల అజిత్ కూడా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ చిత్రాన్నికి సైన్ చేశారు. దీనికి గోపిచంద్ మలినేని డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ఇక ధనుశ్ ఇప్పటికే వెంకీ అట్లూరీతో 'సార్' అనే సినిమా కోసం పనిచేశారు. ఇప్పుడు శేఖర్ కమ్ములతో ఏషియన్ బ్యానర్లో ఓ చిత్రానికి సైన్ చేశారు. ఇలా పలువురు తమిళ నటులు నెమ్మదిగా తెలుగు సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు.ఇదిలావుండగా తెలుగులో తమిళ్ సినిమాలకి ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో చిన్న చిత్రాలని కూడా తెలుగులో డబ్ చేసి వదులుతున్నారు. ఆ సినిమాలకి మన ఎగ్జిబిటర్లు థియేటర్స్ కూడా ఎక్కువగానే ఇస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకి అయితే తెలుగు స్టార్ హీరోలతో సమానంగా స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది. అయితే మన తెలుగు స్టార్ హీరోలకి తమిళంలో మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ లభించదు. అక్కడ ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే కనీసం ఎగ్జిబిటర్లు కూడా తెలుగు సినిమాలని ఎంకరేజ్ చేయరనే టాక్ ఉంది. 'దేవర' మూవీతో ఇది మరోసారి ప్రూవ్ అయ్యింది.
'దేవర' పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అన్ని భాషలలో ఈ సినిమాకి హైప్ ఉంది. తమిళంలో రిలీజ్ అయిన 'దేవర' సాంగ్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే కోలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ 'దేవర' సినిమాకి సంగీతం అందించారు. దీంతో అనిరుధ్ ద్వారా కావల్సిన హైప్ వచ్చింది. అయిన కూడా 'దేవర' మూవీ తమిళనాట థియేటర్స్ కోసం కష్టాలు పడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలో 'దేవర' మూవీకి భారీగా థియేటర్స్ దొరికాయి.కర్ణాటకలో కూడా అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తమిళనాడులో మాత్రం 'దేవర' కి థియేటర్స్ ఇవ్వడానికి ఎగ్జిబిటర్లు ముందుకి రావడం లేదు. అత్యంత తక్కువ బజ్ తో రిలీజ్ అవుతోన్న కార్తీ సినిమా 'మియజగన్' పైన ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపిస్తున్నారు కానీ 'దేవర'కి అనుకున్నంత స్థాయిలో సపోర్ట్ చేయడం లేదంట. సింగిల్ స్క్రీన్స్ లలో కూడా కార్తీ సినిమాకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే స్క్రీన్స్ పరంగా 'దేవర'కి తమిళనాడులో తక్కువ స్క్రీన్ స్పేస్ దొరికిందని అంటున్నారు.ఇదిలావుండగా తమిళ హీరోలతో తెలుగు ప్రొడ్యూసర్లు సినిమాలు తీయడం అనేది కొత్త సాంప్రదాయం ఏమీ కాదు. మద్రాసు పట్టణంలో తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలు పెనవేసుకుపోయి అభివృద్ధి చెందాయి. ఆ కాలం నుంచి తెలుగు ప్రొడ్యూసర్లు నిర్మించే చిత్రాల్లో చాలామంది తమిళ హీరోలు నటించారు. 50వ దశకంలోనే తెలుగు వారైన ప్రముఖ నిర్మాతలు బి.యన్.రెడ్డి, చక్రపాణి ఆధ్వర్యంలోని విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద జెమినీ గణేషన్, శివాజీ గణేషన్, ఎంజీఆర్ లాంటి నటులు పలు చిత్రాల్లో నటించారు. వీరందరూ ఆయా బ్యానర్లలో పలు సూపర్ హిట్స్ అందుకున్నారు. జెమినీ గణేషన్ సూపర్ స్టార్గా నిలిపిన చిత్రాల్లో 'మిస్సియమ్మ', 'గుణసుందరి' సినిమాలను నిర్మించింది విజయ ప్రొడక్షన్స్ వారే కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: