ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోలు అందరికీ దాదాపుగా వారసులు ఉన్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ ఇలా ప్రతి ఒక్కరికీ తనయులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరు ఎక్కడైనా పబ్లిక్‌గా కనిపిస్తే వాళ్ల ఫ్యాన్స్ ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ మురిసిపోతుంటారు. ముఖ్యంగా తమ హీరో పోలీకలు అచ్చు గుద్దినట్లు వచ్చేశాయ్ అంటూ పోస్టులు పెడుతుంటారు.ఈ నేపథ్యంలోజూనియర్ ఎన్టీఆర్, ప్రణతీలకు ఇద్దరు కొడుకులు. ఒకరు అభయ్ రామ్, భార్గవ్ రామ్. అయితే వీరి గురించి తారక్ చెప్తూ తన కొడుకు అభయ్ రామ్ చాలా సౌమ్యుడు తనలాగే, అలాగే తన కొంటె పనులు కూడా ఆయనకే వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఇక ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు కొరటాల శివ. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో యాక్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్క్రిప్ట్ సెలక్షన్ లో మారడానికి కొడుకు అభయ్ రామ్ కారణమని చెప్పుకొచ్చారు. అభయ్ రామ్ పుట్టిన సమయంలో తండ్రిగా నా ఫీలింగ్ ను చెప్పలేనని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. కొడుకు పుట్టిన తర్వాతే నేనేంటో నాకు అర్థమైందని సినిమాల ఎంపికలో సైతం మారాల్సి వచ్చిందని తారక్ అభిప్రాయపడ్డారు. కరణ్ జోహార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ ఈ విషయాలను చెప్పుకొచ్చారు.
దేవర మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండే అవకాశం ఉంది. ఈ సినిమా సక్సెస్ కు టాక్ కీలకం కానుందని చెప్పవచ్చు. దేవర సినిమాకు యునానిమస్ హిట్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా సులువుగా 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో చూడాలి.ఇదిలా ఉంటే 'ఆర్ఆర్ఆర్' తర్వాత దేవర సినిమాని రిలీజ్ చేయడానికి తారక్ చాలా టైం తీసుకున్నారు. అయితే ఇకపై సినిమాల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదని అనుకుంటున్నారు. 'దేవర' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైన్ అప్ లో 'వార్ 2', 'డ్రాగన్', 'దేవర పార్ట్ 2' సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలుగానే రానున్నాయి. అయితే ఈ సినిమాలు ఏడాదికి ఒకటి కచ్చితంగా రిలీజ్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లానింగ్ చేసుకుంటున్నారంట. ఆరేళ్ళుగా సోలో రిలీజ్ లేకపోవడం ఫ్యాన్స్ చాలా అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఇండస్ట్రీలో కూడా హీరోల లైన్ అప్, మూవీకి మూవీకి ఎక్కువ గ్యాప్ తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఏడాదికి ఒక సినిమాని కచ్చితంగా రిలీజ్ చేసేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగా హిందీలో తెరకెక్కుతోన్న 'వార్ 2' చిత్రంతో వచ్చే ఏడాది ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.