'దేవర' విధ్వంసం చూడాలని వుంది.. ఆగలేకపోతున్నా.. తమన్ పోస్ట్ వైరల్..!!

murali krishna
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 27వ తేదీన విడుదల కాబోతోంది.గురువారం అర్థరాత్రి నుంచే షోలు వేస్తున్నారు.
 ఒంటిగంటకు ఇవి ప్రారంభం కానున్నాయి. సినిమా విడుదలకు ముందే దేవర సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే మతిపోతోంది. ప్రీమియర్ షోస్, ప్రీసేల్స్ అమ్మకాల ద్వారా అమెరికాలో రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని దేవర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా భారీ విజయాన్ని పొందాలని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆకాంక్షించారు. ‘నా ప్రియమైన తారక్ అన్నకు బెస్ట్ విషెస్. నా సోదరుడు అనిరుధ్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. రత్నవేలు చిత్రీకరించిన బెస్ట్ విజువల్స్‌కు అదిరిపోయే బీజీఎం లభించిందని అనుకుంటున్నా. తాను ఊహించుకున్న ప్రపంచాన్ని కొరటాల చాలా బాగా తెరకెక్కించారు. ఏ యం బి,యఫ్ డియఫ్ ఎస్ లో లో కలుద్దాం’ అని పోస్ట్ చేశారు.సినిమా విడుదలకు ఇంకా ఒకరోజే సమయం ఉంది. ఆ సమయానికి నాలుగు మిలియన్ డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరగా త్వరలోనే నాలుగు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరనుంది. ఒకరకంగా ఇది సంచలనం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విడుదలకు ముందే రూ.50 కోట్లు అడ్వాన్స్ రూపంలో రావడం అంటే మాములు విషయం కాదని, తారక్ సంచలన రికార్డుల దిశగా పయనిస్తున్నాడంటున్నారు.
 ఇదిలావుండగా గతంలో రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. తర్వాత సోలో హీరోగా వస్తున్న దేవర కూడా ఈ క్లబ్ లో అడుగుపెట్టింది. సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయనేదానికి ఇది నిదర్శనమంటున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. దీంతో గ్రాస్ వసూళ్లు ఏ స్థాయిలో వస్తాయనేది చూడాలి. హిందీలో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నాడు కాబట్టి మంచి థియేటర్లే దొరికాయి. సినిమాకు మంచి టాక్ వచ్చిందంటే చాలు దుమ్ము దులపడం ఖాయమని తారక్ అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. వారి నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలంటే మరో రోజు ఆగితే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: