దేవర: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే ఆయుధ పూజ సాంగ్..!

Divya
దేవర సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లో విడుదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి కొన్ని గంటలలో ఈ చిత్రాలు థియేటర్లో విడుదల కాబోతున్న సందర్భంగా ఈ సినిమా పైన ఏర్పడిన బజ్ వల్ల చిత్ర బృందం అభిమానులకు ఒక అదిరిపోయి గుడ్ న్యూస్ తెలియజేసింది.. అదేమిటంటే దేవర సినిమా నుంచి ఆయుధ పూజ సాంగుని విడుదల చేసింది. ఈ సాంగ్ కి అనిరుద్ సంగీతాన్ని అందించగ రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారట. ప్రస్తుతం అభిమానులను ఈ పాట తెగ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ పాటలో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ మధ్య జరిగేలా కనిపిస్తోంది.. అంతేకాకుండా ఎన్టీఆర్ మాస్ లుక్ లో ఈ పాటలో కనిపిస్తున్నారు. స్లో మోషన్స్ స్టెప్పుల్లో కూడా అదిరిపోయేలా డాన్స్ వేస్తున్నారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో మరొకసారి నటించబోతున్నారు. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ సోలోగా దేవర సినిమాతో వస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పెద్ద పాత్రలో శృతి మరాఠీ నటిస్తూ ఉండగా రెండవ ఎన్టీఆర్ కీ జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ప్లీజ్ బిజినెస్ లో కూడా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాయి దేవర సినిమా అడ్వాన్స్ బుకింగ్ లో కూడా సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. అలాగే ఇతర దేశాలలో కూడా దేవర సినిమా హవ కొనసాగుతూనే ఉంది.

మరి కొన్ని గంటలలో థియేటర్లో సందడి చేయబోతున్న దేవర సినిమా కోసం అభిమానులు ఇప్పటి నుంచే థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. రూ .500 కోట్ల రూపాయల టార్గెట్ తో ఈ సినిమాని బరిలోకి దించబోతున్నారు. డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాతో తన కెరియర్ మరొకసారి మలుపు తిరుగుతుందని కూడా అభిమానులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆయుధపూజ సాంగైతే అందరిని ఆకట్టుకుంటోంది. మరి టాక్ పరంగా ఎలాంటి టాక్ సంపాదించుకొని మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ను రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: