దేవ‌ర ట్విట్ట‌ర్ రివ్యూ... ఎన్టీఆర్ బొమ్మ హిట్టా...ఫ‌ట్టా...?

Divya
ఎట్టకేలకు డైరెక్టర్ కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన దేవర సినిమా ఈ రోజున భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. rrr సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన దేవర సినిమా అభిమానులను ఎక్సైటింగ్ గా అయ్యేలా చేసింది. మరి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానులను ఒప్పించిందా లేదా అనే విషయం తెలుసుకుందాం.

కథ విషయానికి వస్తే: సముద్రానికి చేరువుగా ఉన్న కొండ ప్రాంతంలో 4 గ్రామాలు ఉంటాయట.. ఆ గ్రామంలో ఉంటే నలుగురు పెద్దలు సముద్రం మార్గం నుండి కొన్ని కంటైనర్లను అక్రమంగా తరలిస్తూ ఉంటారట.. అయితే ఆ కంటైనర్లలో కొన్ని మరణాయుధాలు ఉన్నాయని వాళ్ళకి తెలియకుండానే వీటిని అక్రమంగా తరలించడం వల్ల ఆ గ్రామాలకు జరిగే విపత్తులేమిటి అసలు ఆ కంటైనర్లను అలా తరలించాల్సిన అవసరం ఏంటి..?వాటి వెనక ఎవరి పాత్ర ఉంది..? ఇందులో దేవర పాత్ర ఏంటి అనే విషయమే సినిమా కథ అన్నట్టుగా అభిమానులు తెలియజేస్తున్నారు.
డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా కథను డిజైన్ చేసిన విధానం కూడా బాగానే ఉందని పూర్తిస్థాయిలో ప్రేక్షకుడికి సంతృప్తి ఇవ్వలేదనే విధంగా నెటిజెన్స్ తెలియజేస్తున్నారు. సాధారణంగా కొరటాల శివ సినిమా అంటే ఏదైనా మెసేజ్ హైట్ ఉంటుంది. కానీ ఈ చిత్రంలో అలాంటిదేమీ లేదనే విధంగా అభిమానులు తెలుపుతున్నారు. దేవ్, వర అనే రెండు పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఇందులో వరపాత్ర కాస్త తగ్గించిన.. జాన్వీ కపూర్ గ్లామర్ మరింత ఆకర్షణీయంగా ఉన్నదట. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

సెకండ్ ఆఫ్ సైతం కాస్త ఎక్సైటింగ్గా కొనసాగిన క్లైమాక్స్ చివరిలో అనుకోకుండా ఒక ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.రెండో పార్ట్ కి సెటప్ కూడా బాగానే ఉందని వాదన అయితే ఇప్పుడు వినిపిస్తోంది..

దేవర సినిమాకి మైనస్ విషయానికి వస్తే.. రొటీన్ కథ, కొరటాలస్క్రీన్ ప్లే, అక్కడక్కడ కొన్ని బోరింగ్ సీన్స్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా నిరాశ మిగిల్చాయి.

మొత్తానికి దేవర సినిమా అయితే అభిమానులు చూడదగ్గ సినిమా తప్ప మరేం లేదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అలాగే ఎన్టీఆర్పర్ఫామెన్స్, యాక్షన్ సన్నివేశాలు, రత్న వేలు ఫోటోగ్రఫీ, అనిరుద్ మ్యూజిక్ బ్యాగ్రౌండ్ అదరగొట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: