దేవ‌ర : నంద‌మూరి టైగ‌ర్ కోసం చూడొచ్చు...!

praveen
దాదాపు అరేళ్ళ క్రితం జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్.. ఇక ఆ తర్వాత రాజమౌళితో త్రిబుల్ ఆర్ చేశాడు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ హిట్. ఇక ఈ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ ఇండియాలో కాదు.. ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది. ఇంతటి క్రేజ్ సంపాదించిన తర్వాత వచ్చిన మొదటి సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో తారక్ తో జనతా గ్యారేజ్ అనే మూవీ చేసిన కొరటాల హిట్టు కొట్టాడు. దీంతో ఈ హిట్ కాంబినేషన్ పై అభిమానుల్లో అంచనాలు ఉండేవి. కానీ ఆచార్యతో కొరటాల డిజాస్టర్ చవి చూశాడు.

 దీంతో తారక్ కు గ్లోబల్ స్టార్ అని పెరిగిపోయిన క్రేజ్ కి తగ్గట్లుగా కొరటాల శివ సినిమా తీయగలడా లేదా అనే ఒక చిన్న అనుమానం ఎక్కడో తారక్ అభిమానుల్లో మొదటి నుంచి ఉంది. కానీ దేవర సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ పాటలు ఈ అనుమానాన్ని తగ్గించాయి. ఇక బ్లాక్ బస్టర్ అనే నమ్మకంతోనే అభిమానులు అందరూ థియేటర్కు వెళ్లారు. థియేటర్ కు వెళ్ళాక కాని అర్థం కాలేదు సినిమా కోసం కాదు కేవలం ఎన్టీఆర్ను తెరమీద చూడాలనుకుంటే మాత్రమే దేవర కు వెళ్లాలి అని.

 ఎందుకంటే మరోసారి కొరటాల సినిమా తీయడంలో ఫెయిల్ అయ్యాడు. కథలో కొత్తదనం లేకపోవడం.. అభిమానులు ఊహించినట్లుగా ఎన్టీఆర్ హీరోఇజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు ఒకటి కూడా లేకపోవడం.. కనీసం బలవంతంగా విజిల్స్ వేద్దామన్న ఎక్కడ విజిల్స్ కొట్టాలో కూడా తెలియక అభిమానులు సతమతమయ్యే పరిస్థితి ఉండడం సినిమా థియేటర్లలో కనిపిస్తుందని ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటున్నారట. కొన్ని ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ డాన్సులను ఆయన నటనను తెరమీద చూడాలనుకుంటే మాత్రం దేవర సినిమాకు వెళ్లొచ్చని. కానీ ఒక మంచి సినిమా చూడాలనుకుంటే మాత్రం దేవర మంచి ఆప్షన్ కాదని ఏకంగా తారక్ అభిమానులే ఫీల్ అవుతున్నారట. అందుకే ప్రీమియర్ షోలకు వెళ్లిన.. ఈ సినిమా గురించి ఎలాంటి రివ్యూ ఇవ్వాలో తెలియక సైలెంట్ గానే ఉండిపోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: