జాన్వీక‌పూర్ దేవ‌ర‌లో ఉన్న‌ట్టా.. లేన‌ట్టా... నాలుగు సీన్లు ఏంట్రా బాబు..?

praveen
ప్రస్తుతం ఇండియన్స్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. దాదాపు ఆరేళ్ల నిరీక్షణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది దేవర మూవీ. నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తి కావడంతో ఇక దేవరకు సంబంధించిన పబ్లిక్ టాక్ కూడా ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాపై అటు ఎన్టీఆర్ అభిమానులు ఎంతలా ఆశలు పెట్టుకున్నారో అటు జాన్వి అభిమానులు కూడా అంతే రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే దాదాపు గత నాలుగేళ్ల నుంచి జాన్వీ కపూర్ నీ సౌత్ లో నటింప చేయాలని ఎంతో మంది ప్రయత్నాలు చేశారు.

 జాన్వి కపూర్ ఆ హీరో సరసన నటిస్తుంది ఈ హీరో సరసన నటిస్తుంది అంటూ ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరికి ఇక తారక్ సినిమాలో ఫిక్స్ అయింది  ఇది అఫీషియల్ గా మారిపోయింది. అయితే గతంలో ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్ ప్రేక్షకులకు ఆల్ టైం ఫేవరెట్. ఇక ఇప్పుడు  ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కాంబో కావడంతో వీరి కాంబినేషన్ పై అంచనాలు పెరిగిపోయాయి. బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని అభిమానులు అనుకున్నారు. అదే సమయంలో ఇప్పటివరకు విడుదలైన చుట్టమల్లే సాంగ్ ఇతర పాటల్లో జాన్వీని ఏకంగా అతిలోకసుందరిలా చూపించాడు కొరటాల. దీంతో ఈ హీరోయిన్ అభిమానులు అందరూ కూడా తెగ సంతోష పడిపోయారు..

 కేవలం ట్రైలర్ పాటల లోనే జాన్విని ఇలా చూపించారంటే సినిమాలో ఇక దేవకన్యలా చూపించి ఉంటారని..ఆమె పాత్ర చూసి ఫిదా  అవ్వచ్చు అని థియేటర్కు వెళ్లారు జాన్వి అభిమానులు. కానీ అందరికీ నిరాశ ఎదరంది. ఎందుకంటే అసలు నిజంగా దేవర సినిమాలో జాన్వి కపూర్ ఉందా అని అనుమానం అభిమానులకు కలిగింది. ఎందుకంటే సినిమా మొదలైన ఇంటర్వెల్ తర్వాత జాన్వి కపూర్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. సరే కాస్త ఆలస్యంగా వచ్చిన జాన్వి తెరపై చూడవచ్చు అనుకున్నారు అభిమానులు. కానీ మెరుపుతీగ లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది జాన్వి పాత్ర. మొత్తంగా దేవర సినిమా పార్ట్ వన్ లో జాన్వి పాత్రకి కేవలం నాలుగైదు సీన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇదేం సినిమా రా బాబు జాన్విని చూద్దామని వస్తే.. కొరటాల ఇలా డిసప్పాయింట్ చేశాడు అని ఇక ఈ హీరోయిన్ అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: