దేవర టాక్ తో ఆ సినిమా యూనిట్ లో వణుకు..?

Pandrala Sravanthi
 దేవర.. దేవర.. దేవర..ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవర సినిమాకి సంబంధించిన టాకే వినిపిస్తుంది. అయితే చాలామంది అభిమానులు సినిమాకంటే ముందు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ఇవన్నీ చూసి సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. సినిమా చూశాక వారి మనోభావాలు దెబ్బతిన్నాయో ఏమో కానీ సినిమా చూసి బయటికి రావడంతోనే రివ్యూలు అయితే చాలా ఘోరంగా ఇస్తున్నారు. ముఖ్యంగా కొరటాల శివ ను మాత్రం చాలా దారుణంగా తిట్టిపోస్తున్నారు. ఇక ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ అయితే తలదించుకొని సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు. అయితే దేవర సినిమా టాక్ నెగిటివ్ గా ఉండడంతో ఆ సినిమా యూనిట్లో కి వణుకు పుడుతుందట.మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి..దేవరకు ఆ సినిమాకి ఉన్న లింక్ ఏంటి అనేది చూస్తే.. దేవర సినిమా టాక్ తో వణుకు పుట్టేది ఎవరికో కాదు సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2 చిత్ర యూనిట్ కి. అవును ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో ఇదే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన పుష్ప సినిమా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు. 

అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కబోతోంది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ విడుదల కాబోతుంది. అయితే దేవర సినిమా ఫ్లాప్ టాక్ రావడంతో పుష్ప-2 చిత్ర యూనిట్ లో భయం మొదలైందట.ఒకవేళ ఈ సినిమాలో ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా కచ్చితంగా సినిమా మొత్తానికి పెద్ద మైనస్ కానుంది.ఇప్పటికే అల్లు అర్జున్ ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. అటు మెగా అభిమానులతో పాటు జనసేన, టిడిపి, బిజెపి కార్యకర్తలు ఈయన్ని అసహ్యించుకుంటున్నారు. వైసీపీకి సపోర్ట్ చేయడమే ఈయన చేసిన పెద్ద తప్పు అయిపోయింది.అలాగే మెగా కుటుంబంతో ఈయన సఖ్యతగా లేరని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక తాజాగా జానీ మాస్టర్ కేసులో కూడా అల్లు అర్జున్ పేరు వినిపించింది.అలా ఇన్ని వివాదాల మధ్యలో పుష్ప-2  సినిమాలో ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా సినిమాకి దెబ్బడిపోతుంది అని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.అయితే దేవర సినిమా భారీ అంచనాలతో వచ్చింది అలాగే పుష్ప-2  సినిమా మీద కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టోరీ ఏ మాత్రం తేడా కొట్టినా కూడా సుకుమార్ కి అల్లు అర్జున్ కి పెద్ద దెబ్బే అవుతుంది.మరి చూడాలి దేవర సినిమా టాక్ ని దృష్టిలో పెట్టుకొని సుకుమార్ పుష్ప -2 సినిమాలో ఆ తప్పులు చేయకుండా ఉంటారా అనేది సినిమా విడుదల అయితే గాని చెప్పలేం.ఏది ఏమైనప్పటికీ చాలామంది దర్శకులకు హీరోలకు దేవర సినిమాకు గుణపాఠం అని చెప్పుకుంటున్నారు సినీ విశ్లేషకులు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: