యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ఎన్నో అంచనాల నడుమ తాజాగా రిలీజ్ అయి, సంచలన విజయం నమోదు చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాంతో సహజంగానే ఫ్యాన్స్ థియేటర్ వద్ద రచ్చ లేపుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే కొన్నిచోట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే యూఎస్ఏ లో కూడా ఓ ధియేటర్ల వద్ద ఎన్టీఆర్ అభిమానులు దుమ్ము లేపుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.
యూఎస్ఏ లో గల డలాస్ సిటీలో ఓ థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సినిమా చూసిన తర్వాత తమ అభిమానాన్ని చాటుకున్నారు. సినిమా తిలకించిన తరువాత, సినిమా అదిరిపోయింది అంటూ, టపాసులు కాల్చారు. ఇక ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు అయితే పాలాభిషేకాలు నిర్వహించి, బొట్లు కూడా పెట్టడం జరిగింది. దాంతో ఆ సంఘటన తాలూకు దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. దాంతో సదరు వీడియోలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ షేర్ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆయనకి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు మునుపు ఆయన చేసిన ఆచార్య సినిమా ప్లాప్ కావడంతో ఆయనపై చాలా ఒత్తిడి పెరిగింది. ఇక దేవర సినిమా హిట్ కావడంతో ఆయనకు మంచి ఉపశమనం దొరికిందని చెప్పుకోవాలి. ఈ సినిమా ఎన్టీఆర్ కంటే కూడా ఆయనకే అత్యవసరంగా ఏర్పడింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వి హీరోయిన్ గా, తెరపై అదరగొట్టేసారని అంటున్నారు. ఇక సైఫ్ ఆలీ ఖాన్ అయితే ప్రతి నాయకుడి పాత్రలో దుమ్ము దులిపేసాడు అని క్రిటిక్స్ చెబుతున్నారు. ఇక దేశమంతా ఈ సినిమా మొదటి రోజే 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.