ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం దేవర సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమాపై భారీ అంచనాలు పెంచేసి ఇలా చేసేసాడు ఏంటి అని కొరటాల శివని తిట్టుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కనిపించకపోవడంతో ఇద్దరి మధ్య ఏదైనా తేడా కొట్టిందా ఏంటి అని కొంతమంది నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.అయితే ఒకప్పుడు దూర దూరంగా ఉన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లు ఆ తర్వాత చాలా దగ్గరయ్యారు.ఎంతలా అంటే ఒకరి సినిమాలకు మరొకరు నిర్మాతలుగా చేసేలా.. అలాగే అన్నా సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎన్టీఆర్ వెళ్లి ప్రమోషన్స్ చేస్తారు.ఇక తమ్ముడు సినిమా రిలీజ్ అవుతుంది అంటే కళ్యాణ్ రామ్ వెళ్లి ప్రమోషన్స్ చేస్తారు. కానీ పాన్ ఇండియా లెవెల్ లో సోలోగా తమ్ముడు చేస్తున్న దేవర మూవీకి సంబంధించిన ఒక్క ప్రమోషన్ ఈవెంట్ లో కూడా కళ్యాణ్ రామ్ ఎక్కడా కూడా కనిపించలేదు.
అటు చెన్నై, ముంబై రెండు ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు దేవర చిత్ర యూనిట్. అయినప్పటికీ కూడా కళ్యాణ్ రామ్ ఎక్కడా కూడా కనిపించలేదు. ఇక చివరికి తెలుగులో అయినా కళ్యాణ్ రామ్ ప్రమోషన్స్ ఉంటాయి అనుకుంటే అది కూడా లేదు. దీంతో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ మద్య ఎక్కడో దూరం పెరిగింది. అందుకే దేవర సినిమాకి సంబంధించి నెగిటివ్ టాక్ వచ్చినా కూడా స్పందించడం లేదు అని పలువురు నెటిజన్స్ భావిస్తున్నారు.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే నెగటివ్ టాక్ లో ఎలాంటి నిజం లేదు.ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ పాల్గొనకపోవడానికి ప్రధాన కారణం ఆయన తన సినిమా షూటింగ్లో బిజీగా ఉండడమే కళ్యాణ్ రామ్ అవుట్ డోర్ షూటింగ్లో ఉండడం కారణంగానే దేవర సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయారట.కానీ ఈ విషయాన్ని నెగిటివ్ గా చూపించాలని కావాలనే కొంతమంది నెటిజన్స్ అన్నదమ్ముల మధ్య దూరం పెరిగింది అని వార్తలు రాస్తున్నారు.