దేవర: మూవీ పై ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..!

Divya
భారీ అంచనాల మధ్య దేవర చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చి .. ఒకవైపు పాజిటివ్టా మరొకవైపు నెగటివ్ టాక్ ని సంపాదించుకుంది. అయితే కేవలం కొంతమంది హీరోల అభిమానులు, రాజకీయ నేతలు కావాలని ఎన్టీఆర్ సినిమాని తొక్కేయాలనే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయినా కూడా నెగిటివ్ ఎంత క్రియేట్ చేస్తున్నారో పాజిటివ్ గా కూడా అంతే ఎక్కువగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికి ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమాను చూసి ప్రశంసించడం జరిగింది. తాజాగా ఎన్టీఆర్ కూడా తన ట్విట్టర్ నుంచి ఒక విషయాన్ని తెలియజేశారు.

ఎన్టీఆర్ తన ట్విట్టర్ నుంచి .. ఈరోజు విడుదలైన దేవర సినిమాకి వస్తున్న స్పందన చూసి.. చాలా ఆనందమవుతోంది .ఈరోజు కోసమే ఎన్నో రోజులు వేచి ఉంచాను అభిమానుల అపురూపమైన స్పందనలతో చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు. అలాగే డైరెక్టర్ కొరటాల శివకు నిర్మాతలకు, డిఓపికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ.. దేవర సినిమాకి మ్యూజిక్ అందించిన అనిరుద్ పై కూడా ప్రశంసలు కురిపించారు జూనియర్ ఎన్టీఆర్. చివరిగా అభిమానుల ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఇలాగే అలరిస్తూ ఉంటాను అంటూ రాసుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్.

ఈ విషయం పైన అభిమానులు కూడా ఈ ట్వీట్ ను తెగ లైక్స్ కామెంట్లతో వైరల్ గా చేస్తున్నారు. మరి మొదటి రోజే ఎంతటి కలెక్షన్స్ రాబడుతుందనే విషయం పైన అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు.. కొన్ని ప్రాంతాలలో అభిమానులు చేసిన రచ్చల వల్ల చాలా థియేటర్లు కూడా ధ్వంసమయ్యాయి. మరి కొన్నిచోట్ల దేవర సినిమాకి సంబంధించిన భారీ కటౌట్లతో అభిమానులు తెగ హల్చల్ చేస్తున్నారు. మరి సీక్వెల్ విషయం పైన డైరెక్టర్ కొరటాల శివ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు చూడాలి మరి. ఎన్టీఆర్ కూడా వార్ -2 సినిమాతో పాటు ప్రశాంత్ నీళ్లతో మరోక సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: