దేవర మూవీకి ఆ ప్రేక్షకుల నుండి ఇలాంటి రెస్పాన్స్.. అసలు ఊహించలేదుగా..?

Pulgam Srinivas
ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర సినిమా థియేటర్లలోకి ఈ రోజు అనగా సెప్టెంబర్ 27 వ తేదీన గ్రాండ్ గా వచ్చేసింది. మరి భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ఎలాంటి X వేదికలో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుంది అనే వివరాలను తెలుసుకుందాం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన మూవీ కావడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదల అయిన ఈ సినిమాకు ట్విట్టర్ వేదికగా మిశ్రమ స్పందన లభిస్తుంది. కొంత మంది సినిమా అదిరిపోయింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ కావడం పక్క వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టిన పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు అనే స్పందనను వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొంత మంది మాత్రం కథ కొత్తగా ఏమీ లేదు కానీ కొరటాల తన టేకింగ్ తో బాగానే హ్యాండిల్ చేశాడు. కాకపోతే ఈ సినిమాను రెండు భాగాలుగా కాకుండా ఒకే భాగంతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేసి ఉంటే కథ మరింత బలంగా ఉండేది అనే వాదనను కొంత మంది ప్రేక్షకులు వినిపిస్తున్నారు. ఇక మరి కొంత మంది మాత్రం సినిమా యావరేజ్ గా ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అద్భుతంగా నచ్చుతుంది అని చెబుతున్నారు. ఇక మరి కొంత మంది ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేశాడు. ఆయన కోసం సినిమాను చూడొచ్చు అని చెబుతున్నారు. ఇలా X వేదికగా దేవర సినిమాపై అనేక రకాలు అయిన వాదనలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వి కపూర్ నటించగా ... సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: