పరశురాముడు పాత్రలో ప్రభాస్.. బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందేనా..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇక పోతే కొంత కాలం క్రితం ప్రభాస్ "ఆది పురుష్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ సినిమా లో ప్రభాస్ రాముడి పాత్రలో నటించాడు . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా కూడా ఈ సినిమాలోని రాముడి పాత్రలో నటించిన ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. 

కొంత కాలం క్రితం ప్రభాస్ కల్కి 2898 AD అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ వెయ్యి కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడి పాత్రలో నటించాడు. ఇకపోతే ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా రామాయణం అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ లో ప్రభాస్ పరశురాముడు పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు బీ టౌన్ మీడియాలో కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తే ఈ సినిమా రేంజ్ పెరిగి ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: