ఇన్నేళ్లయినా చెక్కుచెదరని అందాన్ని మెయింటైన్ చేస్తున్న అందరివాడు బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి ఇప్పటికి కూడా సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. చిరంజీవి కెరియర్ లో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన అందులోని నటనతో చిరంజీవి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాలలో అందరివాడు మూవీ ఒకటి. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించాడు.
 

ఇందులో ఒక పాత్రలో చిరంజీవి తండ్రిగా కనిపించగా , మరొక పాత్రలో కొడుకుగా కనిపించాడు. ఇక తండ్రి పాత్రలో నటించిన చిరంజీవి కి జోడిగా ఈ సినిమాలో టబు నటించగా , కొడుకు పాత్రలో నటించిన చిరంజీవి కి జోడిగా రిమి సేన్ నటించింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సినిమాలో చిరంజీవి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగానే నవ్వించాడు.

దానితో ఈ సినిమాలోని చిరంజీవి నటనకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రిమీ సేన్ ఆ సమయంలో తన అందాలతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న ఇప్పటికి కూడా ఈ బ్యూటీ తన అందాలను అదే స్థాయిలో మెయింటెన్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అవి సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: