కడపలో కత్తులు పట్టుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. థియేటర్ ఓనర్స్ బెంబేలు!

Suma Kallamadi
జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే తెలుగునాట ఎంత హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో మనకున్న అద్భుతమైన హీరోలలో, జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. ఇక అదే స్థాయిలో ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల విషయంలో కూడా చాలా అభిమానం కనబరుస్తాడు. జూనియర్ అంటే ఫ్యాన్స్ కొట్టుకు చస్తారు. మరి అతను సినిమా రిలీజ్ అవుతుందంటే మామూలుగా ఉంటుందా? థియేటర్లో దద్దరిల్లి పోవాల్సిందే! తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అటువంటి పరిణామాలలే ఎదురయ్యాయి.
మరి ముఖ్యంగా, నందమూరి ఫ్యాన్స్ అత్యధికంగా ఉన్న ఏరియా అయినటువంటి, కడపలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హడావుడి చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కడపలో ఓ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ సదరు థియేటర్ నిర్వాహకుల విషయంలో తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. థియేటర్ వద్దకు చేరుకున్న అభిమానులు దేవర సినిమా ఎర్లీ మార్నింగ్ షో చూద్దామని వెయిట్ చేసే తరుణంలో, థియేటర్ సిబ్బంది ఎంతకీ సినిమా వేయకపోవడంతో గొడవకు దిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే ఎంతసేపు వెయిట్ చేసినప్పటికీ కూడా తెరపై బొమ్మ పడకపోవడంతో, కొంతమంది అభిమానులు థియేటర్ సిబ్బంది పైన చేయి చేసుకున్నట్టు సమాచారం. అదంతా పక్కన పెడితే, తాజాగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన దేవర సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. సినిమా చూసినవారు సినిమా అదిరిపోయింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మాస్ సినిమాలో దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో, జూనియర్ ఎన్టీఆర్, జాన్వి హీరో హీరోయిన్లుగా చేసిన ఈ చిత్రం పైన మొదట నుండి కూడా అంచనాలు నెలకొన్నవి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో అలరించినట్టు తెలుస్తోంది. దేవర మానియా ప్రపంచ వ్యాప్తంగా ఉండడంతో తొలిరోజు వసూళ్లు పైన రకరకాల ఊహాగానాలు వినబడుతున్నాయి. రికార్డు స్థాయిలో 200 కోట్లకు పైగా సినిమా వసూలు చేయబోతుందని గుసగుసలాడుకుంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఈ సినిమాని మీరు చూసినట్టయితే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: