దేవరకు మిక్స్డ్ టాక్ రావడానికి అసలు కారణాలివే.. పాన్ ఇండియా పేరుతో పెద్ద తప్పు చేశారా?
దేవర సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించకుండా ఒకే భాగంగా తెరకెక్కించి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. దేవర సినిమాకు ప్రమోషన్స్ విషయంలో మరింత వేగం పెంచితే బాగుంటుందని చెప్పవచ్చు. దేవర సినిమా పాన్ ఇండియాకు సూట్ అయ్యే సబ్జెక్ట్ కాదని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా రొటీన్ మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కొరటాల శివ దేవర విషయంలో రిస్క్ ఎందుకని భావించి మరీ అతి జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఈ సినిమా ఫలితంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిందని చెప్పవచ్చు. అయితే తొలిరోజే 140 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం మాత్రం ఈ సినిమాకు బెనిఫిట్ కలుగుతుంది. దేవర టాక్ ఎలా ఉన్నా కొన్ని ఏరియాలలో ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.
దేవర పాత్రలో తారక్ మాత్రం అదరగొట్టాడని జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలతో సైతం భారీ హిట్లను సొంతం చేసుకోవడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. క్లైమాక్స్ ట్విస్టుల విషయంలో కొరటాల శివ మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. తారక్ విజయాలకు దేవర బ్రేక్ వేసిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.