చిన్న చిత్రాలపై పాన్ ఇండియా ఎఫెక్ట్.. పాన్ ఇండియా బ్యాన్ అవుతుందా.?

Pandrala Sravanthi
-వన్ స్క్రీన్ థియేటర్లు మూత..
- చిన్న హీరో హీరోయిన్ల పై ఎఫెక్ట్..
- టాలెంట్ ఉన్నా పాన్ ఇండియా తొక్కేస్తోందా..

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసిన పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ మాట్లాడుతున్నారు. కథలో కంటెంట్ లేకపోయినా, పాన్ ఇండియా పేరుతో ఐదు ఆరు భాషల్లో సినిమాను రిలీజ్ చేసి కనీసం ప్రమోషన్ ఖర్చులు కూడా రాబట్టలేక పోతున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే మొత్తం ఇండియాలో ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే కథ అందులో ఉండాలి. కానీ నేటివ్ ప్లేస్ కు సంబంధించిన కథలను తీసుకొని పాన్ ఇండియా సినిమాగా మలిస్తే ఇతర భాషల వారికి అది అర్థం కాక చివరికి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఒక పాన్ ఇండియా సినిమా వచ్చింది అంటే తప్పకుండా అది ఇండియా మొత్తంలోని ప్రతి ఒక్క ప్రేక్షకునికి కథ కనెక్ట్ అయి ఉండాలి. లేదంటే దాన్ని పాన్ ఇండియా లెవెల్ లో తీయకపోవడమే మంచిదని కొంతమంది సీనియర్ సినిమా విశ్లేషకులు అంటున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాల వల్ల ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం వచ్చే యువ హీరోలు హీరోయిన్లు ఇతర నటీనటులు చాలా నష్టపోతున్నారు. అందరూ పాన్ ఇండియా రాగం పాడేసరికి పెద్ద హీరోలను పెద్ద డైరెక్టర్లను హీరోయిన్లను సెలెక్ట్ చేసుకుని సినిమాలు తీస్తున్నారు. ఇక దీంతో చిన్న సినిమాలు అంటే ఎవరికి పట్టింపు లేకుండా పోతోంది. ఒకవేళ కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలు తెరకెక్కించినా థియేటర్లు దొరక్క అనేక ఇక్కట్లు పడుతున్నారు. చిన్న సినిమాపై పాన్ ఇండియా దెబ్బ ఎలా పడుతోంది అనే వివరాలు చూద్దాం.
 వన్ స్క్రీన్ థియేటర్లు మూత:
 పాన్ ఇండియా సినిమా అంటే కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు  తెరకెక్కిస్తారు. ఈ సమయంలో చాలావరకు సినిమాలు రిలీజ్ అవ్వకపోవడంతో వన్ స్క్రీన్ థియేటర్లు ఉన్నటువంటి చాలామంది వ్యాపారులు నష్టపోతున్నారు. ఒకవేళ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను తీసుకున్నా కానీ ఆ స్క్రీన్ దానికి సెట్ అవ్వకపోవడంతో వారు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాన్ ఇండియా అనేది సినిమా ఇండస్ట్రీలో కిందిస్థాయి వర్గాన్ని మరింత చెడగొట్టడమే కాకుండా, సినిమా బోల్తా పడితే దర్శక నిర్మాతలు కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఇక చాలామంది ఓ రేంజ్ ఉన్న హీరోలు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తూ ఉంటే దర్శక నిర్మాతలు కూడా వారి వెంబడే తిరుగుతూ వారితో సినిమాలు చేస్తున్నారు. ఇక కిందిస్థాయి చిన్న హీరోలను పట్టించుకునే నాధుడే లేడు.

 ఒకవేళ కంటెంట్ నచ్చి చిన్న హీరోలతో సినిమా తీసినా థియేటర్లు దొరకక సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అలా పాన్ ఇండియా అనేది కథా కథనం  ఓ రేంజ్ ఉంటేనే తీయాలి తప్ప ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియా లెవెల్ లో మూవీ తీయాలని ముందుకు వెళ్లే వారు నష్టపోవడమే కాకుండా దర్శక నిర్మాతలను నష్టపెట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చే కొత్త వారికి ఛాన్స్ లేకుండా చేస్తున్నారని చెప్పవచ్చు.  ఇలా వీరి వల్ల ఇండస్ట్రీని నమ్ముకున్నటువంటి ఎంతోమంది నష్టాల పాలవుతూ ఇక పాన్ ఇండియా వద్దు రా బాబు బ్యాన్ చేయాలి అనే నినాదం వైపు వెళ్లేలా చేస్తున్నారని చెప్పవచ్చు. ఇండస్ట్రీని పైకి తీసుకెళ్లడం తప్పు కాదు.కానీ పాన్ ఇండియా సినిమా అంటూ పాన్ ఇండియా పేరు బద్నాం చేస్తూ కొంత మంది సినిమాలు తీయడం వల్ల  డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. ప్రతి కథను పాన్ ఇండియా లెవెల్ లో మలిచి తెరకెక్కించడంతో  పాన్ ఇండియా అంటేనే నిర్మాతలు పారిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: