ప్రభాస్ జక్కన్న స్థాయిలో పాన్ ఇండియాలో సక్సెస్ సాధించడం ఇతర సెలబ్రిటీలకు సాధ్యమేనా?

Reddy P Rajasekhar
బాహుబలి, బాహుబలి2 సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో చరిత్ర సృష్టించాయనే సంగతి తెలిసిందే. అటు ప్రభాస్ క్రేజ్ కు ఇటు జక్కన్న అద్భుతమైన స్క్రీన్ ప్లే తోడు కావడంతో ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో చరిత్ర సృష్టించాయి. ఆ తర్వాత కూడా పలు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయినా ఆ సినిమాలు కంటెంట్ వల్ల సక్సెస్ అయ్యాయే తప్ప హీరో లేదా డైరెక్టర్ క్రేజ్ వల్ల సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.
 
మరి ప్రభాస్, రాజమౌళి స్థాయిలో ఇతర సెలబ్రిటీలు పాన్ ఇండియా రేంజ్ లో ప్రతిభ చాటుతారో లేదో చూడాలి. పుష్ప ది రైజ్ హిట్ గా నిలిచినా బన్నీ భవిష్యత్తు సినిమాలకు సైతం ఇదే స్థాయిలో రెస్పాన్స్ వస్తుందనే గ్యారంటీ లేదు. ప్రభాస్ మాత్రమే సాహో, సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకుల మెప్పు పొందే విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారని చెప్పాలి.
 
దేవర సినిమా హిందీలో పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నా ఆ కలెక్షన్లు ఎన్టీఆర్ రేంజ్ కలెక్షన్లు అయితే కాదని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. దేవర సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాల్సి ఉంది. ఓవర్సీస్ లో మాత్రం దేవర కలెక్షన్ల పరంగా అదరగొట్టడం పక్కా అని చెప్పవచ్ఛు.
 
దేవర1 సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో దేవర సీక్వెల్ ఉంటుందా? ఉండదా? అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. దేవర సీక్వెల్ విషయంలో మేకర్స్ నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. దేవర2 మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూడటం లేదు. దేవర సీక్వెల్ పై మేకర్స్ ఎంతమేర ఆసక్తి చూపిస్తారనే చర్చ సైతం జరుగుతోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: