'దేవర' సినిమాకి అసలైన దేవర 'అనిరుధ్' మావ..!!

murali krishna
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అంటే అందరికి తెలుసు. తమిళ్ సంగీత దర్శకుడైనా సౌత్, బాలీవుడ్ లో కూడా అనిరుధ్ పరిచయమే. కేవలం తమిళ్ సినిమాలకే కాక తెలుగులో కూడా మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు. ధనుష్ 3 సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ మొదటి పాట వై దిస్ కొలవరి తోనే స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా, సింగర్ గా ఫుల్ బిజీ అయ్యాడు అనిరుధ్. దాదాపు 50 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన అనిరుధ్ చేతిలో ప్రస్తుతం ఓ డజను సినిమాలకు పైగానే ఉన్నాయి.ఇక సినిమాల్లో పాటలకు మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇస్తాడని పేరు ఉంది. తమిళ్ స్టార్ హీరోలందరికీ సినిమాల్లో గుర్తుండిపోయే పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాడు అనిరుద్. ఇటివలే జైలర్, లియో సినిమాలతో అదరగొట్టాడు. అసలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే సినిమా హిట్ అయ్యేదే కాదేమో అన్నంతగా మెప్పించాడు అనిరుధ్.ఈ నేపథ్యంలో కేవలం యంగ్ డైరెక్టర్స్ తో పనిచేయడం మాత్రమే కాకుండా చాలామంది స్టార్ హీరోలకు భారీ ఎలివేషన్ తన మ్యూజిక్ తో ఇచ్చాడు అనిరుధ్. ఇక ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమాకి మిస్ అయిన అవకాశాన్ని మరోసారి అందిపుచ్చుకొని దేవర సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. దేవర సినిమాకి అనిరుద్ ఇచ్చిన సంగీతం మేజర్ ప్లస్ పాయింట్. సినిమాలో కనిపించేది ఎన్టీఆర్ అయినా, వినిపించేది మాత్రం అనిరుద్. అవకాశం ఉన్న ప్రతి చోట తన పనితనాన్ని చూపించి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు అని చెప్పాలి. వాస్తవానికి అనిరుధ్ లేకపోతే ఈ సినిమాని అసలు ఊహించలేము. ఇక్కడితో కేవలం తమిళ్ హీరోల సినిమాలకు మాత్రమే కాదు తెలుగు సినిమాలలో కూడా అనిరుధ్ తన సత్తా చూపిస్తాను అని నిరూపించాడు.ఇదిలావుండగా ఏ సౌండ్ ఎక్కడ కరెక్ట్ గా వాడాలో, ఎంత లెవల్లో వాడాలో అనిరుధ్ కి బాగా తెలుసు. దీంతో కేవలం పాటలకు సంగీతం మాత్రమే కాకుండా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై పట్టు సాధించి ఇప్పుడు బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు అనిరుధ్. సంగీతం ఇవ్వడమే కాకుండా సింగర్ గా కూడా పాటలతో మెప్పిస్తున్నాడు అనిరుధ్. ఇక అనిరుద్ ఫ్యామిలీ కూడా సినీ పరిశ్రమే. అనిరుద్ తాతయ్య తమిళ్ డైరెక్టర్. రజినీకాంత్ మామయ్య వరుస అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: