మహేష్ పక్కన చిన్న పాత్రలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా..?

Pulgam Srinivas
సినీ పరిశ్రమలోకి చాలా మంది నటీమణులు వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి పెద్దగా అవకాశాలు రావు. దానితో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కూడా నటిస్తూ ఉంటారు. ఇక చిన్న సినిమాల్లో చిన్న పాత్రలలో నటించిన సందర్భంలో పెద్ద గుర్తింపు రాకపోయినా స్టార్ హీరోల పక్కన ఒక నిమిషం నిడివి కూడా లేని పాత్రలలో నటించిన కూడా కొంత మంది కి మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలా మహేష్ బాబు పక్కన నటించిన ఓ అమ్మాయికి ఇలాగే గుర్తింపు వచ్చింది.

కొంత కాలం క్రితం వెంకటేష్ , మహేష్ బాబు హీరోలుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాలు నడుమ విడుదల సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ మూవీలో మహేష్ బాబు కి జోడిగా సమంత నటించగా , జోడిగా అంజలి నటించింది. శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో మహేష్ బాబు పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి నటించిన సన్నివేశం ఒక నిమిషం నిడివి కూడా ఉండదు. కానీ ఆమెకు మాత్రం అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత సినిమాలలో భారీ ఎత్తున అవకాశాలు కూడా వచ్చాయి. ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు సుప్రియ ఐసోలా. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత చాలా సినిమాలలోనే నటించింది. కొంత కాలం క్రితం అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో రూపొందిన బాబు బాగా బిజీ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించి తన అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇక ఈ మధ్య మాత్రం ఈమె పెద్ద స్థాయిలో సినిమాల్లో నటించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: