నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరీర్లో చాలా విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. అలాగే కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే బాలయ్య ఓ సినిమాను మొదలు పెట్టి అందుకు సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేసిన తర్వాత దర్శకుడు ఓ మూవీ ని ఆపివేశాడు. అసలు ఆ సినిమా ఏది ..? ఎందుకు ఆ మూవీ ని ఆపివేశారు అనే వివరాలను తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. ఈయన బాలకృష్ణ హీరోగా చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. వీరిద్దరి కాంబోలో మొత్తం ఐదు సినిమాలు వచ్చాయి. అందులో రెండు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా , రెండు ఇండస్ట్రీ హిట్ లను అందుకున్నాయి.
ఒక సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇక వీరి కాంబోలో ఆరవ సినిమాగా హరహర మహాదేవ అనే టైటిల్ తో మూవీ ని మొదలు పెట్టారు. ఆ మూవీ కి సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా స్టార్ట్ కాలేదు. అసలు ఈ మూవీ ఎందుకు స్టార్ట్ కాలేదు అనే విషయం గురించి ఓ ఇంటర్వ్యూ భాగంగా ఈ సినిమా దర్శకుడు బి గోపాల్ చెబుతూ ... ఈ సినిమా స్టార్ట్ చేసిన సమయానికి మా దగ్గర కథ లేదు.
బెల్లంకొండ సురేష్ ఒక దర్శకుడి దగ్గర కథ ఉంది. దానితో సినిమా చేద్దాం అన్నాడు. దానితో సినిమా స్టార్ట్ చేశాం. కానీ ఆ తర్వాత ఆ దర్శకుడు కథ చెప్పలేదు. చిన్ని కృష్ణ దగ్గర ఒక కథ ఉంది అంటే అది విన్నాను. కానీ అది కూడా నచ్చలేదు. దానితో కథ సెట్ కావడం లేదు అని స్టార్ట్ చేసిన ఆ మూవీ ని ఆపివేశం అని బి గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.