నువ్వు ఫ్లాప్ డైరెక్టర్.. నీతో తారక్ సినిమా చేయడు.. అన్న వారందరికీ గట్టి సమాధానం ఇచ్చిన దర్శకుడు..?

MADDIBOINA AJAY KUMAR
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం జై లవకుశ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో మొట్ట మొదటి సారి త్రిపాత్రాభినయంలో నటించాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలోని తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలోని ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే ఈ మూవీ ని తెరకెక్కించిన దర్శకుడు బాబీ కి కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ దర్శకుడు బాబి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా జై లవకుశ సినిమా స్టార్ట్ కావడానికి ముందు జరిగిన ఒక విషయం గురించి చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో బాబీ మాట్లాడుతూ ... నేను జై లవకుశ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ హీరోగా సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాను రూపొందించాను. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇక ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నేను ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనుకున్నాను. అలా ఆయనతో సినిమా చేయాలి అని నేను అనుకున్న సమయంలో కొంత మంది నువ్వు కొన్ని రోజుల క్రితమే ఓ ఫ్లాప్ మూవీ ని తీసావ్.

ఇప్పుడు నువ్వు ఎన్టీఆర్ తో సినిమా చేస్తాను అంటున్నావ్. నిన్ను నమ్మి ఎన్టీఆర్ సినిమా అవకాశం ఇవ్వడు అని అన్నారు. కానీ నేను మాత్రం ఎన్టీఆర్ ఖచ్చితంగా నాతో మూవీ చేస్తాడు అనే నమ్మకంతో ఆయనకు కథ చెప్పాను. ఆయన దానికి ఓకే చెప్పాడు. ఆ తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది అని బాబి తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం బాబి , నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ మూవీ ని రూపొందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: