మహేష్ కి లేని పోనీ కష్టాలు తెస్తున్న నమ్రత.. ఆ స్టార్ హీరోయిన్లను అంత మాట అనేసిందిగా..!
అసలు విషయానికొస్తే.. నమ్రత 2005లో మహేష్ ని పెళ్లి చేసుకునే అంతవరకు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లతో పోటీ పడుతూ మంచి ఫ్రేమ్ సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చింది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఆమె హీరోయిన్ గా ఉన్న సమయంలో వెబ్సైట్లో మ్యాగజైన్లతో మంచి సంబంధాలు కలిగి ఉండేది. తరచూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండేది. అలాగే ఓ సందర్భంలో Reddit అనే సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఆమె తన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. ఆ క్రమంలోనే ఓ అభిమాని శ్రీదేవి, జుహీ చావ్లాలు ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేశారు. మరి మీ కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు అని అడిగారు...
దీనికి నమ్రత సమాధానం ఇస్తూ.. నేను ఖచ్చితంగా నా భవిష్యత్తుని కంఫర్టబుల్ పొజిషన్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటానని.. జుహీచావ్లా, శ్రీదేవి ఇద్దరు లో సొసైటీకి చెందిన మనుషులంటూ వ్యాఖ్యలు చేసింది. నేను శ్రీదేవిని ఎప్పుడు కలవలేదు కానీ.. ఆమె మనుషులని సరిగ్గా రిసీవ్ చేసుకునే మనిషిలా కనిపించలేదని, ఫ్రిడ్జ్‌లోని ఐస్ వంటిది అని చెప్పుకొచ్చింది. ఇక మాధురి దీక్షిత్ గురించి అడగగా.. మాధురీ తనకు మంచి స్నేహితురాలే కానీ ఆమె అమ్మ చాటు అమ్మాయని మోడ్రన్ సొసైటీకి సింక్ అవ్వదు కానీ గొప్ప నటి అని చెప్పింది. ప్రస్తుతం ఈ చాట్ సోషల్ మీడియలో వైరల్ కావడంతో శ్రీదేవి, మాధురి ఫాన్స్ నమ్రతాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.