మోహన్ బాబు తనయుడు మంచు విష్ణుకు విడాకులా.. హీరో విష్ణు కి ఏమైంది..మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటూ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటున్న మంచు విష్ణుకి భార్యతో జరిగిన గొడవలేంటి? ఎందుకు విడాకులు ఇస్తానని మంచు విష్ణు భార్య ఆయనకి వార్నింగ్ ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. మంచు విష్ణుకి విడాకులు ఇవ్వబోతున్న భార్య అంటే నిజంగానే మంచు విష్ణు కి తన భార్య విరాణిక విడాకులు ఇస్తుంది అని అందరూ భావిస్తారు.కానీ అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. అయితే ఈ మాటలు రూమర్ కాదు. నిజంగా వీరాణిక అన్నవే.. ఇక విషయం ఏమిటంటే..మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు సినిమాల్లో ఓ మోస్తరు హీరోగా హిట్ అందుకుంటున్నారు.అయితే ఈయన చేసిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు అట్టర్ ప్లాఫ్. కానీ మోహన్ బాబు తనయుడు అనే పేరుతో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప మూవీతో మన ముందుకు రాబోతున్నారు..
భారీ తారాగణంతో రాబోతున్న కన్నప్ప మూవీ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే అలాంటి మంచు విష్ణు పర్సనల్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇక తమ్ముడితో గొడవలు అనే విషయం పక్కన పెడితే..మంచు విష్ణు తన భార్యని ఎంతో హ్యాపీగా చూసుకుంటారు. అయితే అలాంటి వీరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది అంటే.. మంచు విష్ణుకి పిల్లలు అంటే చాలా ఇష్టమట. ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నా చాలాదు ఇంకా కావాలి అనిపిస్తుందట. అందుకే ఆయన భార్యకు నలుగురు పిల్లలు పుట్టే వరకు ఉంచారట. అలా ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి విష్ణు దంపతులకు ఉన్నారు. అయితే నలుగురు పుట్టాక కూడా మరో బేబీ కావాలి అని,నాకు పిల్లలు అంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా అంటూ విరాణికతో విష్ణు చెప్పారట.
కానీ అప్పటికే నలుగురి పిల్లల్ని కనీ ఇబ్బందులు పడ్డ విరాణిక అవసరం లేదు ఈ నలుగురు చాలు అని చెప్పిందట. కానీ విష్ణు వినకుండా బెట్టు చేసేసరికి కోపంతో విష్ణు కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట. ఇంకొకసారి పిల్లలు కావాలి అంటే నీకు విడాకులు ఇచ్చేస్తా. నువ్వు వేరే అమ్మాయిని చూసుకో.. ఆ అమ్మాయి నీకు ఎంతమంది కావాలంటే అంత మంది పిల్లల్ని కనిపెడుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చిందట. అయితే భార్య వార్నింగ్ కి భయపడి పోయిన విష్ణు వద్దులే ఈ నలుగురు చాలు అనుకున్నారట. కానీ మనసులో మాత్రం ఇంకొక అమ్మాయా..ఈ ఐడియా ఏదో బాగుందే అంటూ నవ్వుకున్నారట. అయితే ఈ విషయాన్ని మంచు విష్ణు ఓ సందర్భంలో చెప్పి నవ్వులు పూయించారు