ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్ మూవీస్ లిస్ట్.. దేవర ఎన్నో ప్లేస్ లో ఉందంటే..!?

Amruth kumar
ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూసిన ఎన్టీఆర్ అభిమానుల దేవర సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. అందరూ అనుకున్నట్టే ఎన్టీఆర్ బంపర్ హిట్ కొట్టేశాడు. రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు. కలెక్షన్లలో కూడా దేవర సునామీ సృష్టిస్తుంది. తొలిరోజే ఏకంగా రూ.172 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే కలెక్షన్ లిస్టులో దేవర ఏ ప్లేస్ లో ఉందో ఇక్కడ చూద్దాం.
ఇప్పటివరకు టాలీవుడ్ లో ఓపెనింగ్ డే హైయెస్ట్ వసూలు సాధించిన సినిమాలు విషయానికి వస్తే.... ఎన్టీఆర్‌-చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్.  మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.223 కోట్లను దక్కించుకుని టాప్ 1 లో నిలిచింది. ప్రస్తుతానికి ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే మూవీ ఇంకా రాలేదు. ఇక టాప్-2 లో రాజమౌళి-ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి పార్ట్-2 ..ఫస్ట్ డే రూ.214.5 కోట్ల వసూళ్లను త‌న‌ ఖాతాలో వేసుకుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి రూ.182.6 కోట్లను కొల్లగొట్టి టాప్-3లో నిలిచింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సలార్ మూవీ రూ. 165.3 కోట్లతో టాప్-4 లో ఉంది. ఇక‌ టాప్-5 లో యష్  కెజిఎఫ్ చాప్టర్-2 రూ. 162.9 కోట్లను రాబ‌ట్టింది. ఆ తర్వాత విజయ్ దళపతి నటించిన లియో మూవీ మొదటి రోజు రూ142.8 కోట్ల కలెక్షన్స్ దక్కించుకుని టాప్-6 లో నిలిచింది.

ఇక టాప్-7 లో రూ.136.8 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ తో ప్రభాస్  ఆదిపురుష్ మూవీ ఉంది. ఇక ఇప్పుడు ఈ టాప్-7 లిస్ట్ దేవర కూడా చేరిపోయింది. ఇప్పటివరకు టాప్-4 లో ఉన్న‌ ప్రభాస్ సలార్ రికార్డ్ ను బ్రేక్ చేసి. తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ.172 కోట్లు కొల్లగొట్టి టాప్-4 లో నిలించింది .ఇక ఇప్పటిలో ఈ సినిమాకు పోటీగా ఏ సినిమాలు రిలీజ్ కు లేవు . అందులోను దసరా హాలిడేస్ దగ్గరలోనే ఉన్నాయి. సో ఈ మూవీ కచ్చితంగా థియేటర్స్ లో లాంగ్ రన్ మెయింటైన్ చేస్తుందని నమ్మకంగా చెప్పేయొచ్చు. ఆచార్య లాంటి ప్లాప్ తర్వాత కొరటాల శివ హిట్ కొడతాడా లేదా.. అని డౌట్ పడిన వాళ్ళందరూ నోటి మీద వేలు వేసుకుంటున్నారు. ఇదిరా దేవర దెబ్బంటే అని గర్వంగా చెప్పుకుంటున్నారు. మరోసారి ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని ప్రూవ్ అయింది. తారక్ డై హార్డ్ ఫ్యాన్స్ మొదలు ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ప్రతి ఒక్కరిని దేవర మెప్పించింది. దేవర ముందు అంతా బలాదూర్ అనిపించుకునేలా చేస్తుంది. \

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: