దేవర: సక్సెస్ మీట్ లో కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్..!

Divya
డైరెక్టర్ కొరటాల శివ పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ తో కలిసి తెరకెక్కించిన చిత్రం దేవర.నిన్నటి రోజున భారీ అంచనాల మధ్య విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అభిమానుల నమ్మకాన్ని వోమ్ము చేయకుండా మొదటి రోజు దేవర సినిమా రూ .172 కోట్ల రూపాయల అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలిరోజే భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల లో టాప్ త్రీ ప్లేసులో నిలిచింది. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ దేవర సక్సెస్ మీట్ ను సైతం నిర్వహించగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గురించి అద్భుతంగా మాట్లాడారు కళ్యాణ్ రామ్.

నాలుగేళ్లుగా మేమందరం పడిన కష్టం మీ ముందు ఉంచాము. ఈ దేవర చిత్రం పైన మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేనిది. ఇంత ఆప్యాయత చూపించిన అభిమానులకు ఇంతటి కలెక్షన్స్ సంపాదించిన మా ప్రేక్షకులకు నందమూరి అభిమానులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటు కళ్యాణ్ రామ్ వెల్లడించారు.కొరటాల శివ గురించి మాట్లాడుతూ డైరెక్టర్ కొరటాల శివ ఒక అద్భుతమైన కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో మా నాన్న కుమ్మేశాడు అంటూ తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచేశారు కళ్యాణ్ రామ్.

నాన్న నీ యాక్టింగ్ అదుర్స్ నేను గర్వంగా చెబుతున్నాను ఇది నీ వన్ మ్యాన్ షో సినిమా అంటూ చిన్న గూస్ బంప్స్ తీసుకువచ్చింది క్లైమాక్స్ అంటూ తెలియజేశారు. ఈ సినిమా ఇంతలా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటూ వెల్లడించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందపడడమే కాకుండా ఏదైనా పాత్ర నచ్చితే కళ్యాణ్ రామ్ ను నటింప చేయమంటూ కొరటాల శివకు సలహా ఇస్తున్నారు. మొత్తానికి దేవర సక్సెస్ మీట్లో కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఎన్ని రోజుల్లో సాధిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: