దేవర: ఫ్యాన్స్ గెట్ రెడీ.. సక్సెస్ అడ్డా ఎక్కడంటే..?

Divya
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాను చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.. అయితే మరి కొంతమంది మాత్రం కొరటాల శివ ఈ సినిమా విషయంలో మరింత జాగ్రత్త ఉంటే బొమ్మ మరొక లాగా ఉండేదని టాక్ కూడా వినిపిస్తోంది. ఫైనల్ గా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ 172 కోట్లతో వారి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఉన్న దేవర బజ్ వల్ల అతి తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి.

దేవర సినిమా రిలీజ్ కి ముందు ఎన్టీఆర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తో అభిమానులతో ముచ్చటించాలనుకున్న కొన్ని కారణాలవల్ల ఇది జరగలేదు.. అయితే సినిమా రిలీజ్ అయ్యి అద్భుతమైన టాక్ రావడం వల్ల సక్సెస్ మిట్ మాత్రం చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం ఈసారి చాలా విశాలమైన గ్రౌండ్లో దేవర సక్సెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారట.అది తెలంగాణలో లేదా ఏపీలో అనే విషయం ఇంకా తెలియలేదు.

కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చేసిన కూడా ఈసారి అభిమానులను ఇబ్బంది కలిగించేలా ఉండకూడదనే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట. దేవర సక్సెస్ రావడంతో అటు అభిమానులతో కూడా ఈ జోరు ఫుల్ గా కనిపిస్తోంది. సినిమా రిలీజ్ అయిన వారం రోజులలోపే సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే కళ్యాణ్ రామ్ కూడా తన తమ్ముడు దేవర సినిమా కోసం ఎలా కష్టపడ్డారనే విషయాన్ని కూడా మీడియా ముఖంగానే తెలియజేశారు. మరి సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి ఏం మాట్లాడతారనే విషయం పైన అందరూ చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: