ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్‌... ఆ హీరోను బ‌తిమిలాడుతోన్న పూరి జ‌గ‌న్నాథ్ ..!

RAMAKRISHNA S.S.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో 2000 సంవ‌త్స‌రం లో మెగాఫోన్ పట్టి టాలీవుడ్ లో అతి తక్కువ టైంలోనే తిరుగులేని డైరెక్టర్ అయిపోయారు పూరి జగన్నాథ్. ఒకప్పుడు పూరి జగన్నాథ్ కు ఎలాంటి గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే. బద్రి - ఇడియట్ - అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి - పోకిరి - దేశముదురు - చిరుత - టెంపర్ ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు స్టార్ హీరోలకు అందించారు. అలాగే మహేష్ బాబుతో రెండోసారి బిజినెస్మెన్ లాంటి సూపర్ హిట్ ఇచ్చారు. చాలా తక్కువ టైంలో కథ రాయటం ... జెట్ స్పీడ్ లో షూటింగ్ కంప్లీట్ చేయటంలో పూరి తన స్టైలే వేరు అని చాలాసార్లు ప్రూవ్ చేశారు.

అలాంటి పూరికి గత పది .. 12 సినిమాలలో ఒక టెంపర్ తప్ప ఆ తర్వాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ మినహా ఏ సినిమా హిట్ అవ్వలేదు. వరుసగా పెద్ద డిజాస్టర్లు ఎదుర్కొంటున్నారు. విజయ్ దేవరకొండ తో లైగ‌ర్ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్‌ను ఎవరు నమ్మలేదు. లైగ‌ర్ త‌ర్వాత వెంట‌నే పూరికి జ‌న‌గ‌ణ‌మ‌ణ తో మ‌రో ఛాన్స్ ఇచ్చాడు విజ‌య్‌.. లైగ‌ర్ త‌ర్వాత స‌గం షూట్ చేసిన సినిమాను కూడా ప‌క్క‌న పెట్టేశారు. మ‌హేష్ బాబు అయితే అస‌లు పూరిని ద‌గ్గ‌ర‌కు రానిచ్చే ప‌రిస్థితి కూడా లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ ఇచ్చారన్న కృతజ్ఞతతో రామ్ డబుల్ స్మార్ట్ తో అవకాశం ఇచ్చారు.

ఆ సినిమాతో పూరి హిట్ ట్రాక్ ఎక్కుతాడని భావిస్తే డిజాస్టర్ అయింది. దీంతో అసలు ఇప్పుడు పూరీతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ లో టైర్ టు .. మిడిల్ రేంజ్ హీరోలు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీంతో పూరి ఇప్పుడు కింగ్ నాగార్జున కు ఓ క‌థ చెప్పి ఓ ఛాన్స్ ఇవ్వండి సార్ .. ఖ‌చ్చితంగా హిట్ ఇస్తాన‌ని ఒప్పించే ప్ర‌య‌త్నాల్లో బిజీ గా ఉన్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు న‌డుస్తున్నాయి. గ‌తంలో నాగ్  - పూరి కాంబోలో సూప‌ర్‌, శివ‌మ‌ణి సినిమాలు వ‌చ్చాయి. మ‌రి ఇప్పుడు అయినా పూరికి నాగ్ మ‌రో ఛాన్స్ ఇస్తాడేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: