టాలీవుడ్ మహిళా డైరెక్టర్‌పై అత్యాచారం ... అంతా సీక్రెట్.. గప్‌చుప్..?
ఇది టాలీవుడ్ లో ఇటీవల కాలంలో బాగా ఎక్కువైనట్టు కూడా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఓ మహిళ అసిస్టెంట్ డైరెక్టర్ పై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన బయటకు వచ్చింది. యూసఫ్ గూడ పరిధిలోని మధురానగర్ లో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నగరంలోని రహమత్ నగర్ కు చెందిన ఓ మహిళ ( 30 ) అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుంది. అయితే ఆమె ఈ ఏడాది జూన్‌లో తన భర్తతో విడాకులు తీసుకుంది. ఇటీవల ఆమెకు ఇంస్టాగ్రామ్ లో శశికిరణ్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.
తనకు మూవీ కార్యాలయం ఉందని అందులో పని చేయాలని ఆ మహిళలకు మాయమాటలు చెప్పాడు. ఈనెల 27వ తేదీ రాత్రి మధురానగర్ లోని తన గదికి రావాలని శశికరణ్ రెడ్డి చెప్పడంతో ఆమె అక్కడికి వెళ్ళింది. అనంతరం శశికరణ్ రెడ్డి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎలాగోలా ఆ గది నుంచి బయటపడింది. ఆ విషయం ఆమె రెండు అంతస్తులోని వారికి చెప్పడంతో వారు 100కు డయల్ చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చాలా గప్ చుప్ గా జరుగుతోన్న ఇలాంటి వ్యవహారాల్లో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.