మిగతా పాన్ ఇండియా స్టార్లను తొక్కిపడేసిన ఎన్టీఆర్..

Suma Kallamadi
అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి పాన్ ఇండియా హీరోలు హిందీ మాట్లాడతారు కానీ వారికి హిందీ అంత అనర్గళంగా రాదు. అందుకే వారి సినిమాలకు హిందీలో వేరే వాయిస్ ఇస్తారు. ఎన్టీఆర్ జూనియర్ మాత్రం హిందీ చాలా బాగా మాట్లాడతారు. అందుకే ఆయన హిందీ సినిమాల్లో నటించడానికి ఎక్కువ అవకాశాలు వస్తాయని చెప్పుకోవచ్చు. జూ.ఎన్టీఆర్ దేవర హిందీ వర్షన్ మూవీకి తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. వార్ 2 సినిమాలో కూడా తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడు. ఈ రెండు సినిమాలు ఆయన్ని అసలైన పాన్ ఇండియా స్టార్‌గా యాడ్ చేయవచ్చు అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. సొంత డబ్బింగ్ చెప్పుకోలేని హీరోలు ఎప్పుడూ కూడా పాన్ ఇండియా స్టార్లు అవ్వలేదు.
ముఖ్యంగా హిందీలో ఎవరికి వారే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారు. ఉదాహరణకి మనం టాలీవుడ్ హీరోయిన్లను చూసుకోండి. కీర్తి సురేష్, సాయి పల్లవి, రష్మిక మందాన ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది తమకోసం సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని ప్రేక్షకులకు బాగా వారు వేరే రాష్ట్రంలో పుట్టిన తెలుగు రాష్ట్రాల ప్రజల వలె కలిసిపోయారు. అలా ఎన్టీఆర్ హిందీ వాళ్ళతో ఇప్పుడు కలిసిపోతున్నారు. మిగతా పాన్ ఇండియా స్టార్లను తొక్కి పడేస్తున్నారు.
'దేవర' సినిమా తొలి రోజునే ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇది ఎంత పెద్ద విజయమో అర్థం చేసుకోవడానికి ఈ ఫిగర్ సరిపోతుంది. 'RRR' తర్వాత ఇది ఎన్టీఆర్ జూనియర్ కెరీర్‌లో మరో పెద్ద విజయం. ఈ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా మరింత పాపులర్ అయ్యారు. ప్రభాస్, అల్లు అర్జున్ లాగా ఎన్టీఆర్ జూనియర్ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరున్న హీరో. కానీ, వీళ్ళందరికీ లేని ఒక ప్రత్యేకత ఎన్టీఆర్ జూనియర్‌కు ఉంది. అదేమిటంటే, ఆయనకి అనేక భాషలు వస్తాయి.
'RRR' సినిమా ప్రమోట్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ చాలా భాషలు మాట్లాడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఆయన హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, జపనీస్ భాషలు కూడా మాట్లాడతారు. 'దేవర' సినిమా హిందీలో విడుదలైన తర్వాత తారక్ హిందీ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ హైదరాబాద్‌లో పెరిగినందున ఆయనకు హిందీ బాగా వస్తుంది. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి హిందీ ప్రేక్షకులకు ఆయన చాలా ఇష్టం. ప్రభాస్ కూడా చాలా మందికి ఇష్టమైన హీరో. కానీ ఆయన కొంచెం మౌనంగా ఉంటారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ లాగా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: