జగిత్యాలలో మరో జానీ మాస్టర్..సింగర్ ను రేప్ చేసి?

Veldandi Saikiran
రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్యకాలంలో  ప్రేమ వ్యవహారాలు, ఎఫైర్లు లేదా రేప్ కేసులు తెరపైకి వస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నుంచి మొదలుకొని...లేటెస్ట్ గా యూట్యూబర్ హర్ష సాయి వరకు... అందరూ మహిళల విషయంలోనే వివాదంలో చిక్కుకున్నారు. అయితే తాజాగా... జానీ మాస్టర్ తరహాలోనే....జగిత్యాల లో మరో జానీ మాస్టర్ తేలాడు. ఓ లేడీస్ సింగర్..ను వాడుకొని వదిలేసాడు.

పెళ్లి చేసుకోమంటే.. ఛీ పో అంటున్నాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఒకసారి పరిశీలిస్తే... ఫోక్ సాంగ్స్ రైటర్ సుద్దాల మల్లిక్  తేజ గురించి తెలియని వారు ఉండరు. తెలంగాణలో.. చాలా రకాల ఫోక్ సాంగ్స్ పాడి మల్లిక్ తేజ ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా తెలంగాణ సింగర్ మామిడి మౌనిక... అనే అమ్మాయితో...  చాలా పాటల్లో  నటించాడు కూడా. సింగర్ మామిడి మౌనిక అలాగే తేజ... కాంబినేషన్లో అనేక రకాల పాటలు కూడా వచ్చాయి.

అయితే సింగర్ మామిడి మౌనికను... బ్లాక్ మెయిల్ చేసి వాడుకున్నాడట సుద్దాల తేజ. అంతేకాదు ఆమెపై లైంగిక దాడి కూడా చాలాసార్లు చేసినట్లు తాజాగా స్వయంగా సింగర్ మామిడి మౌనిక ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా జగిత్యాల పోలీసులను... సింగర్ మామిడి మౌనిక కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సింగర్ సుద్దాల తేజ పైన కేసు పెట్టింది. తనను చాలా సార్లు లైంగికంగా వేధించడానికి కూడా ఆ మౌనిక పేర్కొంది.
 

స్టూడియోలో పలుసార్లు అత్యాచారం కూడా చేశాడని మౌనిక తెలపడం జరిగింది. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి స్టూడియోలోనే రేప్ చేశాడని సింగర్ మామిడి మౌనిక తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు తనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అలాగే ఇంస్టాగ్రామ్ ఐడి ల పాస్వర్డ్ లో మార్చి వేధిస్తున్నాడని కూడా ఆమె ఫైర్ అయింది. వెంటనే సుద్దాల తేజ పైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది మౌనిక. దీనిపై పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: